జమ్ముకశ్మీర్‌లోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో కొత్తగా 127 ఉద్యోగులను నియమించేందుకు ఆ రాష్ట్ర పాలకమండలి అంగీకారం తెలిపింది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇందులో 50 సీనియర్ ఎలక్షన్ అసిస్టెంట్, 77 జూనియర్ ఎలక్షన్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
ఈ కొత్త ఉద్యోగాల ద్వారా ఎరోనెట్, బ్లోనెట్తో పాటు భారత ఎన్నికల సంఘం ప్రారంభించే పలు కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయనున్నారు. అలాగే జమ్ముకశ్మీర్‌లో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియతో పాటు జాబితా నుంచి నకిలీ ఓటర్ల తొలగింపు వంటి సేవలు అందించేందుకు ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు.