ETV Bharat / bharat

జమ్ము కశ్మీర్​ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా- కారణమిదే!

జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము తన పదవికి రాజీనామా చేశారు. కొత్త 'కాగ్​'గా బాధ్యతలు చేపట్టనున్న నేపధ్యంలోనే ఈ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రాంతానికి కొత్త గవర్నర్ నియామకం విషయంపై స్పష్టత లేదు.

J&K Lieutenant Governor GC Murmu Resigns, Say Sources
జమ్ము కశ్మీర్​ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా- కారణమిదే!
author img

By

Published : Aug 6, 2020, 5:31 AM IST

జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది పూర్తైన సమయంలో ముర్ము రాజీనామా చేయడం గమనార్హం. ఆయన రాజీనామాకు గల అధికారిక కారణాలు ఇంకా తెలియలేదు.

కొత్త కాగ్!

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్​గా ముర్ము బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలోనే గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు ఉన్నతస్థాయి అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాజీవ్ మెహర్షి ఈ వారంలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ముర్మును నియమించినట్లు తెలుస్తోంది. అయితే జమ్ము కశ్మీర్​కు కొత్త లెఫ్టినెంట్ గవర్నర్​గా ఎవరు నియమితులవుతారనే విషయంపై సమాచారం లేదు.

అక్టోబర్ 29న జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్​గా బాధ్యతలు తీసుకున్నారు ముర్ము. గుజరాత్​ క్యాడర్​కు చెందిన ఐఏఎస్​ అధికారి అయిన ముర్ము.. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టక ముందు ఆర్థిక శాఖలో కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.