ETV Bharat / bharat

కశ్మీర్​లో తెరుచుకున్న ప్రభుత్వ కార్యాలయాలు

జమ్ముకశ్మీర్​లో నేడు ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి తెరుచుకున్నాయి. ఆంక్షల ఎత్తివేతపై శుక్రవారం నమాజ్ అనంతరం పరిస్థితులను గమనించాక గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని రాజ్​భవన్​ అధికార ప్రతినిధి తెలిపారు.

author img

By

Published : Aug 16, 2019, 2:17 PM IST

Updated : Sep 27, 2019, 4:45 AM IST

కశ్మీర్లో తెరుచుకున్న ప్రభుత్వ కార్యాలయాలు

జమ్ముకశ్మీర్​ సచివాలయంలో శుక్రవారం నుంచి యథావిథిగా విధులు నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్​ ఆదేశాలు జారీ చేశారు. ఇతర అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరుకావాలని సూచించారు.

కశ్మీర్​లో భద్రతా పరిస్థితులపై స్వాతంత్ర్య వేడుకల అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకన్నారు సత్యపాల్. శుక్రవారం నమాజ్​ వేళల అనంతరం పరిస్థితిని గమనించాక ఇతర ఆంక్షల ఎత్తివేతపై నిర్ణయం తీసుకునే వీలుదందని రాజ్​భవన్ అధికార ప్రతినిధి చెప్పారు. నిన్న కశ్మీర్​లో స్వాతంత్ర్య వేడుకలు ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు​. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు.

గురువారంతో ముగిసిన అమర్​నాథ్ యాత్రపైనా సమీక్ష నిర్వహించారు సత్యపాల్​. 3.30లక్షల మంది భక్తులు పవిత్ర లింగాన్ని దర్శింకున్నట్లు రాజ్​భవన్​ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి: 'కశ్మీర్​'సంబంధిత పిటిషన్లపై సుప్రీం విచారణ వాయిదా

Intro:Body:Conclusion:
Last Updated : Sep 27, 2019, 4:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.