ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ)లోని 17 బుల్లి శునకాలకు లద్దాఖ్‌లోని కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాల పేర్లు పెట్టారు. ఈ మేరకు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. 'బెల్జియన్ మలినాయిస్' జాతికి చెందిన ఈ శునకాలు సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పంచకులలోని భాను వద్ద ఉన్న జాతీయ శునక శిక్షణ కేంద్రం(ఎన్టీసీడీ)లో పుట్టాయి.
ఇకపై ఆ శునకాలను అనేలా, గల్వాన్, ససోమా, శ్యోక్, చాంగ్ చెన్మా, దౌలత్, రెజాంగ్, రాంగో, చర్దింగ్, ఇమిస్, యులా, శ్రీజప్, సుల్తాన్ చుక్సు, ముఖ్ప్రి, చుంగ్ తుంగ్, ఖార్దుంగీ పేర్లతో పిలవనున్నారు. ఈ బుల్లి శునకాలు ఓల్గా, ఒలేష్యా అనే ఆడ శునకాలకు జన్మించాయి. ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టడంలో అమెరికా సీల్ దళాలకు ఇవి ఎంతో సహకరించాయి. అప్పటి నుంచి ఈ జాతి శునకాలు 'ఒసామా హంటర్' అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి.
ఇదీ చూడండి:దుబాయ్‌లో భారతీయుడిని వరించిన అదృష్టం