ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్)కు చెందిన కే9 బృందంలో కొత్తగా 17 మలినాయిస్ జాతి కుక్క పిల్లలు చేరాయి. హరియాణా పంచకులలోని ఐటీబీపీకి చెందిన ఎన్టీసీడీ(నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్‌లో) ఓల్గా, ఒలేస్య శునకాలు ఈ 17 పిల్లలకు జన్మనిచ్చాయి.
కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చేందుకు జరిపిన ఆపరేషన్‌లో ఈ మలినాయిస్ జాతి శునకాలనే వాడింది అమెరికా. ఓల్గా, ఒలేస్య కూడా ఐటీబీపీకి అనేక మార్లు ఉపయోగపడ్డాయి.
"ఓల్గా, ఒలేస్య అక్కాచెల్లెళ్లు. వాటి వయసు ఐదేళ్లు. తండ్రి పేరు గాలా. అది కూడా సర్వీస్‌లోనే ఉంది. ఈ మూడు కుక్కలు ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వహిస్తున్నాయి. ఓల్గా 9 పిల్లలకు, ఒలేస్య 8 పిల్లలకు జన్మనిచ్చాయి."
-- ఐటీబీపీ.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్‌లోని అటల్ టన్నెల్‌ను ఆవిష్కరించారు. ఆ సమయంలో యాంటీ-సాబటాజ్ డ్యూటీని నిర్వహించింది గాలా. ఈ జాతి శునకాల భద్రతా దళానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఐటీబీపీ వెల్లడించింది. ఈ శునకాలను ఉగ్రవాద- నక్సలైట్ల వ్యతిరేక కార్యకలాపాల కోసం ఉపయోగించనున్నట్టు పేర్కొంది.
ఇదీ చూడండి:- ఆ బీచ్‌లో పందులే ప్రత్యేక ఆకర్షణ