భారత పర్యటన నిమిత్తం గత శనివారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు వచ్చిన ఓ ఇటలీ వ్యక్తిలో కరోనా లక్షణాలు గుర్తించారు అధికారులు. అయితే పుణెలో పరీక్షలు నిర్వహించి.. అతనికి సోకింది కరోనానో కాదో నిర్ధరించనున్నారు.
ఇదీ జరిగింది..
ఓ ఇటాలియన్ వ్యక్తి గత శనివారం జైపూర్‌కు వచ్చాడు. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా లక్షణాలు కనిపించలేదు. కానీ.. అతని ఆరోగ్య పరిస్థితిపై అనుమానంతో అధికారులు.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచి రెండోసారి పరీక్షలు చేశారు. సోమవారం వచ్చిన ఫలితాల్లో కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది.
రెండు పరీక్షల్లో వేర్వేరు ఫలితాలు రావడంపై రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ స్పందించారు. మరోమారు పరీక్షలు చేసేందుకు బాధితుడి సాంపుల్స్‌ను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: బంగారం అమ్మేస్తున్నారు.. విమానాలకు గిరాకీ