ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు మద్దతు ఇవ్వటం తిరుగుబాటు కాదని స్పష్టం చేశారు ఎన్సీపీ నేత అజిత్ పవార్. తాను ఎన్సీపీలోనే కొనసాగుతానని వెల్లడించారు. పార్టీ అధినేత శరద్ పవార్ ఆదేశాల అనుసారం నడుచుకోనున్నట్లు తెలిపారు.
" ఇది తిరుగుబాటు కాదు. నేను ఎన్సీపీ నాయకుడిని. నన్ను పార్టీ తొలగించిందా? మీరు ఎక్కడైన చదివారా? నేను ఎన్సీపీలోనే ఉన్నానని చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పటికీ, ఎప్పటికీ.. నేను ఎన్సీపీలోనే ఉంటాను."
- అజిత్ పవార్, ఎన్సీపీ నేత
దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో శనివారం ఏర్పడిన భాజపా ప్రభుత్వానికి మద్దతు పలికారు అజిత్ పవార్. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ.. నాలుగు రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేసి మద్దతు ఉపసంహరించుకున్నారు.
ఇదీ చూడండి: రేపే ఠాక్రే ప్రమాణం.. అతిరథమహారథులకు ఆహ్వానం