ETV Bharat / bharat

'ఇది 1962నాటి భారత్​ కాదు.. ఇప్పుడు మోదీ ఉన్నారు' - rahul gandhi latest updates

భారత్​-చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టింది భాజపా. ఇది 1962నాటి భారత్​ కాదని, ధైర్యశాలి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్నామని కేంద్రమంత్రి రవి శంకర్​ ప్రసాద్​ ఉద్ఘాటించారు.

It is not the India of 1962, says BJP amid Sino-India border standoff
'ఇది 1962నాటి భారత్​ కాదు.. ఇప్పుుడు మోదీ ఉన్నారు'
author img

By

Published : Jun 10, 2020, 10:25 PM IST

సాహసోపేత నిర్ణయాలు తీసుకునే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇప్పుడు భారత్​ ఉందని.. 1962నాటి పరిస్థితులు లేవని వ్యాఖ్యానించారు భాజపా సీనియర్​ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. భారత్​-చైనా మధ్య సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. హిమాచల్​ప్రదేశ్ భాజపా వర్చువల్​ ర్యాలీలో ఈ విషయంపై మాట్లాడారు.

స్వావలంబన భారత్​ సాధనకు కృషి చేస్తూనే దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు రవి శంకర్​. మోదీ ప్రభుత్వం మొదటి సారి అధికారంలో ఉన్నప్పుడు పాకిస్థాన్​పై సర్జికల్ స్ట్రయిక్, మెరుపు దాడులు నిర్వహించామని గుర్తు చేశారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తుంటే, ప్రధాని మోదీ నిశ్శబ్దంగా ఉన్నారంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై మండిపడ్డారు. అంతర్జాతీయ అంశాల మీద సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నలు వేయొద్దని సూచించారు. గతంలో బాలాకోట్ వైమానిక దాడులు, 2016 ఉరి దాడులకు ఆధారాలు కావాలని రాహుల్​ అడిగారని దుయ్యబట్టారు.

"మేం శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నాం. ఒక విషయం స్పష్టం చేస్తున్నాం. ఇది 1962 నాటి భారత్​ కాదు. ధైర్యశాలి మోదీ అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్​ నాయకులు కాదు. దీన్ని అర్థం చేసుకోవాలి. "

-రవిశంకర్​ ప్రసాద్​, కేంద్రమంత్రి.

చైనా భారత్​ను ఓడించినప్పుడు కాంగ్రెస్​ అధికారంలో ఉందన్నారు రవి శంకర్​. కాంగ్రెస్​ నాయకులకు దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశీ వ్యవహారాలపై ఎంత అవగాహన ఉందనే విషయంపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.