క్రీడా స్ఫూర్తి తరహాలో ఇస్రో స్ఫూర్తితో దేశం ఉప్పొంగిపోతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారని కొనియాడారు మోదీ. ప్రతికూలతను అంగీకరించేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు.
హరియాణా రోహ్తక్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు మోదీ. సెప్టెంబరు 7న ఉదయం 1:50 గంటలకు చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్ ఆచూకీ కోల్పోయిన ఘటనను గుర్తుచేశారు. ఆ వంద సెకన్ల పాటు జరిగిన పరిణామాలు 125 కోట్ల మంది భారతీయుల స్వభావాన్ని ప్రతిబింబించాయని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలందరినీ ఇస్రో ఏకం చేసిందని కొనియాడారు.
" సెప్టెంబరు 7వ తేధీ ఉదయం 1:15 గంటలకు దేశం, ప్రపంచ దేశాల ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. ఇస్రో శుభావర్త కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆ ఘటన తర్వాత 100 సెకన్ల పాటు దేశమంతా ఏకమయ్యింది. మహోన్నత పరిణామాలను నేను చూడగలిగాను. క్రీడా స్ఫూర్తి తరహాలో దేశమంతా ఇస్రో స్ఫూర్తితో నిండిపోయింది"
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.
ఇదీ చూడండి: చంద్రయాన్-2: ల్యాండర్ ఆచూకీ లభ్యం.. కానీ...