ETV Bharat / bharat

చంద్రయాన్​-2: ఇస్రో ఏం చేసినా ప్రత్యేకమే..! - ఆవాసానికి

చంద్రయాన్​-2...! ఇప్పుడు దేశమంతా ఇదే చర్చ. వైజ్ఞానిక ప్రపంచం దృష్టి మొత్తం ఈ ప్రాజెక్టుపైనే. ఇతర దేశాల శాస్త్రవేత్తల ఆసక్తికి కారణం... చంద్రయాన్​-2కు ఉన్న ప్రత్యేకతే. ఏంటా విశిష్టత..? 2008లో చేపట్టిన చంద్రయాన్​-1కు, ఈ ప్రాజెక్టుకు మధ్య వ్యత్యాసం ఏంటి..?

చంద్రయాన్​-2: ఇస్రో ఏం చేసినా ప్రత్యేకమే..!
author img

By

Published : Sep 6, 2019, 2:56 PM IST

Updated : Sep 29, 2019, 3:46 PM IST

చంద్రయాన్​-2: ఇస్రో ఏం చేసినా ప్రత్యేకమే..!

చంద్రయాన్​-2 ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనాల సరసన నిలుస్తుంది భారత్​. ఇప్పటివరకు ఆ దేశాల రోవర్​లు మాత్రమే చందమామపై మృదువుగా ల్యాండ్​ అయ్యాయి.

భారత్​ 2008లోనే ప్రయోగించిన చంద్రయాన్​-1కు కొనసాగింపు చంద్రయాన్​-2. అయితే.. దీనికెన్నో ప్రత్యేకతలున్నాయి. అప్పటి ప్రయోగం.. కేవలం జాబిల్లి కక్ష్యకే పరిమితమై సమాచారాన్ని సేకరించి భూమికి పంపింది. చంద్రయాన్​-1తో అంతరిక్ష రంగంలో భారత్​ ముద్ర ఉండాలన్న బలమైన ఉద్దేశంతో చంద్రయాన్​-1లో 35 కిలోల ఇంపాక్టర్​ను చంద్రుడి ఉపరితలంపైకి జారవిడిచింది. అది బలంగా చంద్రుడిని ఢీకొట్టింది.

చంద్రయాన్​-2లోని ల్యాండర్​, రోవర్​ మాత్రం చంద్రుడి ఉపరితలంపైకి సున్నితంగా దిగుతాయి. ముఖ్యంగా రోవర్​.. చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ ప్రయోగాలు చేస్తుంది. స్వీయ పరికరాలతో.. ఫొటోలూ తీసి అక్కడి వివరాలను భూమికి పంపుతుంది. కాబట్టి చంద్రయాన్​-1తో పోలిస్తే... చంద్రయాన్​-2 ఎంతో క్లిష్టమైన, ప్రతిష్టాత్మక భారీ ప్రయోగం.

అందుకే ఇస్రో తగు జాగ్రత్తలు తీసుకుంది. ఏ మాత్రం పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది.
దక్షిణ ధ్రువంపై తొలిసారి...

చంద్రయాన్​-2తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్​ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా భారత్​ చరిత్ర సృష్టించనుంది. ఇప్పటివరకు ఏ దేశమూ ఈ ఘనత సాధించలేదు. దక్షిణ ధ్రువంపై అనుకూల పరిస్థితులే.. ల్యాండ్​ చేయాలనుకోవడానికి ఓ కారణం.

సౌరకుటుంబానికి సంబంధించిన ఎన్నో అంతుచిక్కని విషయాలు దక్షిణ ధ్రువంపైనే నిక్షిప్తమై ఉన్నాయని భావిస్తున్నారు. నీటి జాడ ఉంటుందని.. తద్వారా ఇక్కడ ఆవాసానికి ప్రత్యమ్నాయ మార్గాలు సృష్టించుకోవచ్చని విశ్వసిస్తున్నారు.

New Delhi, Sep 06 (ANI): Chief Minister Arvind Kejriwal said that there has been 25% reduction in Delhi's pollution. "According the data of Delhi Pollution Control Broad and Central Pollution Control Board, from 2012 to 2014 the Particulate Matter (PM) 2.5 was 154 and in between 2016 to 2018 PM 2.5 has reduced to 115. So, there has been a reduction of 25% in Delhi's pollution," said CM Kejriwal.
Last Updated : Sep 29, 2019, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.