ఇద్దరు వ్యోమగాములను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన.. స్పేస్ ఎక్స్ సంస్థ, నాసాలకు.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అభినందనలను తెలియజేసింది. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు ఇది సరికొత్త నాంది అని అభివర్ణించింది.
"2011 తర్వాత మొదటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగమిది. అద్భుతంగా పని చేశారు."అని ఇస్రో ట్వీట్ చేసింది.
అమెరికా వ్యాపార వేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ రూపొందించిన క్రూడ్ డ్రాగన్ వ్యోమనౌక శనివారం నాడు ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.
మిషన్ గగన్‌యాన్...
భారత్ కూడా ఇస్రో ద్వారా.. తన తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం 'గగన్‌యాన్'ను సిద్ధం చేస్తోంది. రూ.10 వేల కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్.. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2022లో గగన్‌యాన్ ప్రయోగం చేయనుంది. గగన్‌యాన్ యాత్రలో పాల్గొనే భారత వ్యోమగాములు రష్యాలోని మాస్కోలో శిక్షణ పొందుతున్నారు.
ఇదీ చూడండి:జమ్మూలో ఆరుగురు జైషే ఉగ్రవాదుల అరెస్టు