ETV Bharat / bharat

'ఆ రెండు దేశాలు ప్రత్యక్షంగా చర్చలు జరుపుకోవాలి'

ఇజ్రాయెల్​, పాలస్తీనాల మధ్య నెలకొన్న సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను కోరింది భారత్​. ఇందుకోసం ప్రత్యక్ష చర్చలు జరిపి ఓ నిర్ణయానికి రావాలని సూచించింది.

Israel, Palestine should hold direct talks for 'two-states solution': India
ఇజ్రాయెల్​, పాలస్తీనాలు ప్రత్యక్షంగా చర్చించాలి: భారత్​
author img

By

Published : Jul 2, 2020, 10:55 PM IST

తమ మధ్య ఉన్న వివాదాన్ని ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని ఇజ్రాయెల్​-పాలస్తీనా దేశాలను కోరింది భారత్​. శాంతియుతంగా జీవించేందుకు పరస్పర అంగీకారంతో ఓ నిర్ణయానికి రావాలని సూచించింది. వెస్ట్​ బ్యాంక్ ఆక్రమించుకున్న​ భూభాగాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ఇజ్రాయెల్​ ప్రణాళికలు వేస్తోన్న నేపథ్యంలో.. ఇరు దేశాల వివాదంపై తన వైఖరిని పునరుద్ఘాటించింది భారత్​.

వివాదాస్పద భూభాగంలోని 30శాతాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు​ గత జనవరిలో తెలిపింది ఇజ్రాయెల్. మిగిలిన ప్రాంతంలో పాలస్తీనా ప్రజలకు పరిమిత స్వయంప్రతిపత్తిని ఇవ్వాలని నిర్ణయించింది.

అంతర్జాతీయంగా విమర్శలు..

అయితే.. ఇజ్రాయెల్​ వ్యూహానికి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఆ దేశం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఐక్యరాజ్యసమితి సహా ఐరోపా సమాఖ్య​, అరబ్​ దేశాలు ఆరోపించాయి.

ఇదీ చదవండి: నేపాల్ ప్రధానికి ఎందుకీ 'రాజీ'నామా కష్టం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.