ఒడిశాలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. ఈ నెల 24 నుంచి 26 మధ్య కాలంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అభిప్రాయపడింది. ఈ ప్రభావంతో ఆగస్టు 25, 26 తేదీల్లో బంగాల్లో.. 26న ఝార్ఖండ్‌లోని పలుచోట్ల భారీ వానలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.
ఈ మేరకు రానున్న 24 గంటల్లో దక్షిణ రాజస్థాన్, బిహార్, పశ్చిమ మధ్యప్రదేశ్, బంగాల్, ఝార్ఖండ్‌లో పిడుగుపాటులు సంభవించే అవకాశముందని వెల్లడించింది.
పెరిగిన యమునా నది నీటిమట్టం
కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా దిల్లీ యమునా నదిలో నీటి మట్టం పెరిగింది.
ఇప్పటికే భారీ వర్షాల ధాటికి గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అసోం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన ఈ వరదలు.. సాధారణ జన జీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.
ఇదీ చదవండి: పరవళ్లు తొక్కుతున్న చిత్రకోట్ జలపాతం