ETV Bharat / bharat

భారత్​లో ఐసిస్ ఉగ్రసంస్థ​ కొత్త బ్రాంచ్..! - Wilayah of Hind

ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాద సంస్థ భారత్​లో నూతన శాఖ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కశ్మీర్​లో మే 10న జరిగిన ఎన్​కౌంటర్​లో పాల్గొన్నది తమ సభ్యులేనని చెప్పింది. ఐసిస్​ ప్రకటనను తోసిపుచ్చారు జమ్ముకశ్మీర్​ సీనియర్​ పోలీసు అధికారి ఒకరు.

భారత్​లో ఐసిస్ ఉగ్రసంస్థ​ కొత్త బ్రాంచ్..!
author img

By

Published : May 12, 2019, 9:21 AM IST

Updated : May 12, 2019, 10:54 AM IST

భారత్​లో ఐసిస్ ఉగ్రసంస్థ​ కొత్త బ్రాంచ్..!

భారత్​లో ఉనికి చాటుకునేందుకు ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాద సంస్థ ప్రయత్నాలు చేపట్టింది. భారత్​లో నూతన శాఖను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కొత్త బ్రాంచ్​కు అరబిక్​ భాషలో 'విలాయా​ ఆఫ్​ హిందు' ( భారత రాష్ట్రం)గా నామకరణం చేసినట్లు అమాక్​ న్యూస్​ ఏజెన్సీ ద్వారా వెల్లడించింది ఐసిస్​. అయితే ఈ నూతన శాఖ భౌగోళిక పరిధులపై స్పష్టత ఇవ్వలేదు.

కొత్త శాఖకు సంబంధించి ఈనెల 10నే టెలిగ్రామ్​ యాప్​ ద్వారా ఐసిస్​ ఓ సందేశం పంపింది. మెషీన్​ గన్లతో కూడిన ఐసిస్​ ఉగ్రవాదులు కశ్మీర్​ షోపియాన్​ జిల్లా అమ్షీపురాలో భద్రతా సిబ్బందితో పోరాడారని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో ఐసిస్​ స్పష్టత ఇవ్వలేదు.

మీడియా కథనాల ప్రకారం మే 10న షోపియాన్​ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.

పూర్తిగా అసత్యం...

భారత్​లో కొత్త శాఖ ఏర్పాటుపై ఐసిస్​ ప్రకటనను జమ్ముకశ్మీర్​ సీనియర్​ పోలీస్​ అధికారు ఒకరు తోసిపుచ్చారు. తప్పుడు వార్తగా కొట్టిపారేశారు.

కొత్తేం కాదు...

పశ్చిమాసియాలో దాదాపు ఆధిపత్యం కోల్పోయింది ఐసిస్​. అందుకే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో పట్టు సాధిస్తున్నామని సంకేతాలిచ్చేందుకు ఐసిస్​ అధినేత అబు బకర్​ అల్​ బాగ్దాదీ ఎప్పటినుంచో ఇలాంటి కొత్త శాఖ ప్రకటనల వ్యూహం అమలు చేస్తున్నాడు.

2017 నవంబర్​ నుంచి భారత్​లో జరిగిన అనేక దాడులకు బాధ్యత ప్రకటించుకుంది ఐసిస్

AP Video Delivery Log - 0200 GMT News
Sunday, 12 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0001: Chile Bus Crash No Access Chile 4210456
Several dead after bus overturns in Chile
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 12, 2019, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.