మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రమాణస్వీకారానికి రాహుల్ గాంధీ గైర్హాజరు కావటంపై భారతీయ జనతా పార్టీ వ్యంగస్త్రాలు సంధించింది. మహాత్మ గాంధీ హంతకుడైన నాథూరాం గాడ్సేను గతంలో శివసేన పొగడ్తలతో ముంచెత్తిన విషయాన్ని ప్రస్తావించి... కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణమిదేనా అంటూ రాహుల్‌ను ఎద్దేవా చేసింది.
కపటంగా ఉండటం మానేయండి రాహుల్ గాంధీ. సామ్నా(శివసేన అధికార పత్రిక) సంపాదకీయులు ఉద్ధవ్ ఠాక్రే.. గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించారు. ఇందుకోసమేనా మీరు కార్యక్రమానికి హాజరుకావడానికి సిగ్గుపడ్డారు. ఉద్ధవ్‌ను ఆలింగనం చేసుకోవడం అంటే తను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లేనని రాహుల్ భయపడ్డారేమో? -జీవీఎల్ నరసింహారావ్, భాజపా అధికార ప్రతినిధి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై కూడా నరసింహా తీవ్ర విమర్శలు చేశారు. సామ్నా పత్రికను 'సోనియానామా'గా పేరు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు..