ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఇర్ఫాన్ మరణించటం ప్రపంచ సినిమాకు, నాటక రంగానికి తీరని లోటని అన్నారు.
"వివిధ మాధ్యమాల్లో అసమాన ప్రతిభ కనబరిచిన ఇర్ఫాన్ ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు నా సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను"
-నరేంద్రమోదీ ట్వీట్.
ఇర్ఫాన్ ఖాన్ కేన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ ముంబయిలోని ఓ ఆసుపత్రిలో బుధవారం కన్నుమూశారు. చివరిసారిగా ఆయన 'అంగ్రేజీ మీడియం' అనే సినిమాలో నటించి మెప్పించారు.