ETV Bharat / bharat

రైతులను ఆపేందుకు దిల్లీ సరిహద్దులో మేకులు

author img

By

Published : Feb 1, 2021, 9:10 PM IST

Updated : Feb 1, 2021, 11:32 PM IST

ఈ నెల 26న జరిగిన ఘటన తర్వాత రైతులు.. దిల్లీలో ప్రవేశించకుండా నిలువరించేందుకు భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు అధికారులు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. తాజాగా సింఘు, టిక్రీ, గాజీపుర్​ సరిహద్దుల్లోని ప్రధాన రహదారుల మధ్య పదునైన ఇనుప మేకులతో కాంక్రీట్​ నిర్మాణ పనులు చేపట్టారు.

దిల్లీ సరిహద్దు రహదారి మధ్యలో ఇనుప రాడ్​లు

సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘు, టిక్రి సహా గాజీపుర్​ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులు దిల్లీలోకి ప్రవేశించకుండా భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. అంతేకాకుండా రహదారి మధ్యలో కాంక్రీట్​​ పోతపోసి అందులో పదునైన ఇనుప మేకులను అమర్చారు. జనవరి 26 తర్వాత పోలీసులు, రైతులు మధ్య పలుమార్లు ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఈ విధమైన నిర్మాణ పనులను అధికారులు చేపట్టినట్లు తెలుస్తోంది.

రైతులు ఆందోళన చేస్తోన్న ప్రాంతాల్లోని ప్రధాన రహదారి మధ్యలో రెండు వైపులా బారికేడ్లు ఉంచి.. సూదిమెనదేలిన ఇనుప మేకులను ఉంచి కాంక్రీట్​ నిర్మాణాలు చేపడతున్నారు. మొదట దిల్లీ-హరియాణా సరిహద్దుల్లో ఈ విధంగా ఏర్పాటు చేసిన అధికారులు.. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రైతుల వాహనాలు దిల్లీలోకి ప్రవేశించకుండా నిలువరించడానికి వీటిని అమర్చినట్లు తెలుస్తోంది.

Iron bars
Iron bars
రోడ్లపై ఇనుప మేకులు

రాకేశ్​ టికాయిత్​ ఆందోళన చేస్తోన్న గాజీపుర్‌ సరిహద్దుల్లోకి ఉద్యమానికి మద్దుతుగా రైతుల దండు కదలడం వల్ల భద్రతా ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు అధికారులు. డ్రోన్ల సాయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చూడండి: రైతు ఉద్యమంపై చర్చకు వాయిదా తీర్మానం

Last Updated : Feb 1, 2021, 11:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.