జమ్ముకశ్మీర్లో ఏర్పాటు చేసిన క్యాంపు నుంచి వెంటనే వెళ్లిపోవాలని తనతో పాటు ఉన్న వంద మంది క్రికెటర్లను ప్రభుత్వం ఆదేశించినట్లు ఆ రాష్ట్ర క్రికెట్ జట్టు కోచ్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. ఇప్పటికే క్రికెటర్లు ఇళ్లకు తరలినట్లు చెప్పాడు.
క్రికెటర్లతో పాటు క్యాంపులోని సిబ్బందినీ ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు పఠాన్ తెలిపాడు.
"మా క్యాంపును మూసివేశాం. క్రికటర్లు వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ క్యాంపు జూన్ 14 నుంచి జులై 14 వరకు కొనసాగింది. 10 రోజుల విరామం అనంతరం మళ్లీ జులై 25న ప్రారంభమైంది. శనివారం సుమారు 100 మంది ఆటగాళ్లు ఇళ్లకు వెళ్లారు. జులై 31-ఆగస్టు 17 వరకు మ్యాచ్లు జరగాల్సి ఉంది. జిల్లా స్థాయి క్రికెటర్ల ఎంపిక కోసం ఈ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు."
- ఇర్ఫాన్ పఠాన్, భారత మాజీ క్రికెటర్
ఉగ్రముప్పు పొంచి ఉందన్న కారణంగా రాష్ట్రంలోని పర్యటకులు, అమర్నాథ్ యాత్రికులు కశ్మీర్ నుంచి వెళ్లాలని ఇటీవలే ఆదేశించింది ప్రభుత్వం.
ఇదీ చూడండి: ఆపరేషన్ కశ్మీర్: అమిత్షా ఉన్నత స్థాయి సమీక్ష