ETV Bharat / bharat

రైల్వే: పర్యటకులకు భారత్​ దర్శన్ టూరిస్ట్​ ప్యాకేజీ - గాంధీజీ

భారతీయ రైల్వే ప్రత్యేకంగా 'భారత్​ దర్శన్ టూరిస్ట్​ ప్యాకేజీ'ని ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీ సెప్టెంబర్​ 27 నుంచి ప్రారంభమవుతుంది. పర్యటనలో భాగంగా మహాత్మాగాంధీజీ జన్మస్థలమైన పోర్​బందర్, సబర్మతి ఆశ్రమం, సర్ధార్ వల్లభాయ్ పటేల్​ ఐక్యతా విగ్రహాలను దర్శించవచ్చు.

రైల్వే: పర్యటకులకు భారత్​ దర్శన్ టూరిస్ట్​ ప్యాకేజీ
author img

By

Published : Sep 18, 2019, 7:52 AM IST

Updated : Oct 1, 2019, 12:43 AM IST

మహాత్మా గాంధీకి సంబంధించిన ప్రదేశాలతో పాటు గుజరాత్​, మధ్యప్రదేశ్​ల్లోని పర్యాటక ప్రాంతాలకు కలిపి ఐఆర్​సీటీసీ భారత్​ దర్శన్​ టూరిస్ట్​ ప్యాకేజీని ప్రారంభిస్తోంది. ఈ ప్రత్యేక ప్యాకేజీ సెప్టెంబర్​ 27 నుంచి ప్రారంభమవుతుందని రైల్వే పర్యటక, క్యాటరింగ్​శాఖ తెలిపింది.

ఈ టూరిస్టు ప్యాకేజీ ద్వారా.. గాంధీజీ జన్మస్థలమైన పోర్​బందర్​, అహ్మదాబాద్​లోని సబర్మతి ఆశ్రమాన్ని దర్శించవచ్చు. అలాగే వడోదరలోని ప్రపంచంలోనే అతి ఎత్తైన వల్లభాయ్​ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించవచ్చు.

పర్యటన ఇలా..

ఈ పర్యటన ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లు కొనసాగుతుంది. మధ్యప్రదేశ్​లోని రేవా నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. ఇండోర్​ (ఓంకారేశ్వర్​), ఉజ్జయిని (మహా కాళేశ్వర్​), అహ్మదాబాద్​, ద్వారక, పోర్​బందర్​, సోమనాథ్​గా సాగి చివరకు వడోదర (ఐక్యతా విగ్రహం) వద్ద ముగుస్తుంది.

మార్గమిలా..

రేవా-సత్నా- మైహార్​- కట్ని- జబల్పూర్​- నర్సింగ్​పూర్​- పిపారియా- ఇటార్సి- హోషంగాబాద్​- హబీబ్​గంజ్​- సెహోర్​- షుజల్​పూర్​- మక్సీ- దేవాస్​- ఇండోర్- ఉజ్జయిని- అహ్మదాబాద్- ద్వారకా- పోర్​బందర్​- సోమనాథ్​-వడోదర.... ఇది పూర్తయిన తరువాత తిరుగు విహారయాత్ర కొనసాగుతుంది.

అందుబాటు ధరలో...

ఈ పర్యాటక ప్యాకేజీలో స్లీపర్ క్లాస్​లో ఒక్కో వ్యక్తికి రూ.8,505 ఉంటుంది. థర్డ్​ ఏసీకి అయితే రూ.10,395లు ఉంటుంది. పర్యటకులకు ప్రత్యేక గది, స్వచ్ఛమైన శాఖాహార భోజనం, పర్యటక ప్రదేశాలను దర్శించడానికి బస్సులు, భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.

ఇదీ చూడండి: అక్టోబర్​ 2న సబర్మతీ ఆశ్రమానికి ప్రధాని మోదీ!

AP Video Delivery Log - 0100 GMT News
Wednesday, 18 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0050: Israel Arab Election Reax AP Clients Only 4230467
Arab Israelis react to election exit polls
AP-APTN-0049: MidEast Lieberman AP Clients Only 4230469
Lieberman: Unity govt only option for Israel
AP-APTN-0049: UN Afghanistan AP Clients Only 4230477
UN adopts Afghan resolution without China detail
AP-APTN-0048: Israel Gantz AP Clients Only 4230480
Gantz: Too early to declare victory in Israel elex
AP-APTN-0037: Venezuela Opposition AP Clients Only 4230479
Venezuela opposition renews support for Guaido
AP-APTN-2348: US TX Immigration Tent Courts AP Clients Only 4230478
Homeland Security gives media tour of courts
AP-APTN-2307: US Russia Probe Loyalist AP Clients Only 4230475
Trump loyalist grilled on message to Sessions
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 12:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.