ETV Bharat / bharat

నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేస్తే ఏడేళ్లు జైలు! - నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వ, బ్లాక్​ మార్కెట్​పై కొరడా!

లాక్​డౌన్​ సమయంలో నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వ, బ్లాక్​ మార్కెట్​పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. ధరల నియంత్రణ, స్టాక్​ నిల్వలపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. అక్రమాలకు పాల్పడిన వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా కేసులు మోపాలని సూచించింది.

black marketing essentials
నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వ, బ్లాక్​ మార్కెట్​పై కొరడా!
author img

By

Published : Apr 8, 2020, 1:44 PM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతున్న వేళ నిత్యావసర వస్తువుల లభ్యతపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. నిత్యావసర సరకుల అక్రమ నిల్వ, బ్లాక్​ మార్కెట్​కు పాల్పడే వారిపై కఠిన చట్టాలను అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఉత్పత్తి నిలిచిపోయి, కార్మికుల కొరత ఏర్పడ్డ సమయంలో బ్లాక్​ మార్కెటింగ్​ను ఉపేక్షించకూడదని స్పష్టం చేసింది.

ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా. 21 రోజుల లాక్​డౌన్​ సమయంలో విపత్తు నిర్వహణ చట్టం కింద.. నిత్యావసరాలు, మందులు, వైద్య సామగ్రికి సంబంధించి ఉత్పత్తి, సరఫరాను అనుమతించాలని కోరారు. కార్మికుల కొరతపై దృష్టి సారించి ఉత్పత్తిని పెంచాలని సూచించారు.

" ఈ పరిస్థితుల్లో అక్రమ నిల్వ, బ్లాక్​ మార్కెట్​, ధరలు పెంచే అవకాశం ఉంది. అలాంటి చర్యలను ఉపేక్షించకూడదు. నిత్యావసర వస్తువుల చట్టం(ఈసీ) 1955 నియమాల ప్రకారం అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇందులో వస్తువుల స్టాక్​ నిల్వలపై పరిధి, ధరల నియంత్రణ, ఉత్పత్తి పెంచటం, డీలర్ల ఖాతాలను తనిఖీ చేయటం వంటివి చేపట్టాలి. "

- అజయ్​ భల్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి.

ఈసీ చట్టం నియమాలను ఉల్లంఘించిన వారికి 7 ఏళ్ల జైలు శిక్ష, జరిమానాతో పాటు రెండూ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు భల్లా. బ్లాక్​ మార్కెట్​ నిరోధం, నిత్యావసర వస్తువుల సరఫరా చట్టం 1980 కింద నేరస్థులను అదుపులోకి తీసుకోవచ్చని రాష్ట్రాలకు సూచించారు. సరసమైన ధరల్లో వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు.

ఇదీ చూడండి: ఆ దుకాణంలో అమ్మేవాళ్లు లేరు... కానీ కొనుక్కోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.