ETV Bharat / bharat

అంతర్జాతీయ ప్రయాణికులకు కాంటాక్ట్​లెస్​ ప్రక్రియ - SELF DECLARATION FORM

విదేశాల నుంచి భారత్​కు వచ్చే ప్రయాణికులు సమర్పించాల్సిన స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్​లైన్​లో నింపేందుకు ప్రత్యేక పోర్టల్​ను ప్రవేశపెట్టింది దిల్లీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ లిమిటెడ్​. దీనితో పాటు ఇన్​స్టిట్యూషనల్​ క్వారంటైన్​ నుంచి మినహాయింపు పొందాలనుకునే వారు కూడా సంబంధిత పత్రాలను ఆన్​లైన్​లోనే నింపేందుకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్​ నేపథ్యంలో భౌతిక ప్రక్రియలను తగ్గించి, కాంటాక్ట్​లెస్​ పద్ధతులను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

International arrival process made easy with contact-less solution for passengers coming to India
అంతర్జాతీయ ప్రయాణికులకు కాంటాక్ట్​లెస్​ ప్రక్రియ
author img

By

Published : Aug 8, 2020, 12:34 PM IST

కరోనా వైరస్​ నేపథ్యంలో విదేశాల నుంచి భారత్​కు వచ్చే ప్రయాణికుల కోసం దిల్లీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ లిమిటెడ్​(డీఐఏఎల్​) సరికొత్త వెసులుబాటును ప్రవేశపెట్టింది. కాంటాక్ట్​లెస్​ ప్రక్రియలో భాగంగా.. విదేశాల నుంచి భారత్​కు చేరుకునే వారు అందించాల్సిన స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్​లైన్​లోనే నింపొచ్చని తెలిపింది. ఇన్​స్టిట్యూషనల్​ క్వారంటైన్​ ప్రక్రియ నుంచి మినహాయింపు కోసం దాఖలు చేయాల్సిన పత్రాలను కూడా ఆన్​లైన్​లోనే దరఖాస్తు చేయవచ్చని వెల్లడించింది. ఈ మేరకు.. దేశంలోనే తొలిసారిగా ఓ పోర్టల్​ను రూపొందించింది. దీనితో భౌతికంగా చేయాల్సిన పనులు తగ్గిపోతాయి.

ఈ ఆన్​లైన్​ ప్రక్రియను పౌర విమానయాన శాఖ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ, విదేశంగ శాఖ, వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల అనుసంధానంతో కలిసి అభివృద్ధి చేసింది డీఐఏఎల్​. ఈ వెసులుబాటు శనివారం నుంచే అమల్లోకి వచ్చింది.

ఐదు ప్రత్యేకమైన కేటగిరీల నుంచి మినహాయింపు కోరుకునే ప్రయాణికులు.. "www.newdelhiairport.in"లో ఈ-ఫాం నింపాల్సి ఉంటుంది. విమాన ప్రయాణానికి కనీసం 72గంటల ముందే.. సంబంధిత పత్రాలు, పాస్​పోర్ట్​ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. స్వీయ ధ్రువీకరణ పత్రాలకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు.

ఇదీ చూడండి:- విమాన ప్రమాద ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.