ETV Bharat / bharat

5 రోజుల పాటు భారీ వర్షాలు- ఆ రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ - వాతావరణం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దేశంలో పలు ప్రాంతాల్లో వచ్చే 5 రోజులు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. వర్ష ప్రభావం అధికంగా ఉన్న ఒడిశా, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో వరుసగా ఆగస్టు 26, 27 తేదీల్లో రెడ్​ అలర్ట్ ప్రకటించింది.

IMD
ఐఎండీ
author img

By

Published : Aug 25, 2020, 10:07 PM IST

దేశంలో తూర్పు, ఉత్తర, మధ్య రాష్ట్రాల్లో వచ్చే 5 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 4,5 రోజులలో పశ్చిమ-వాయవ్యం దిశగా వెళ్ళే అవకాశం ఉండటమే కారణమని తెలిపింది.

ఫలితంగా ఒడిశా, బంగాల్, ఝార్ఖండ్​ రాష్ట్రాల్లో ఆగస్టు 28 వరకు, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్, రాజస్థాన్​లో ఆగస్టు 26-28 మధ్య భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఒడిశాలో ఆగస్టు 26, తర్వాతి రోజు ఛత్తీస్​గఢ్​లో రెడ్​ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ.

హిమాచల్​ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్​, లద్దాఖ్, గిల్గిత్ బాల్టిస్థాన్, పంజాబ్​, హరియాణా, దిల్లీ ఉత్తర్​ప్రదేశ్​, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం ఉంటుందని తెలిపింది.

ఇదీ చూడండి: కూలిన ఆ భవనంలో నాలుగేళ్ల బాలుడు సేఫ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.