ETV Bharat / bharat

బదిలీ విషయం నాకు ముందే తెలుసు: జస్టిస్​ మురళీధర్​ - జస్టిస్ మురళీధర్​ బదిలీ

బదిలీ విషయం తనకు ముందే తెలుసన్నారు దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​. మురళీధర్​. దిల్లీలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దిల్లీ అల్లర్ల కేసును విచారించిన రోజే జస్టిస్​ మురళీధర్​ను పంజాబ్​-హరియాణ కోర్టుకు బదిలీ చేసింది కేంద్రం.

Informed of transfer on Feb 17; no problem with P&H HC, says Justice Muralidhar at farewell
బదిలీ విషయం నాకు ముందే తెలుసు: జస్టిస్​ మురళీధర్​
author img

By

Published : Mar 5, 2020, 7:46 PM IST

దిల్లీ అల్లర్ల కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​. మురళీధర్​ బదిలీపై ఇటీవలే రాజకీయ దుమారం రేగింది. భాజపా నేతలను కేసుల నుంచి రక్షించేందుకే న్యాయమూర్తిని బదిలీ చేశారని కాంగ్రెస్​ ఆరోపించింది. అయితే ఈ విషయం తనకు ముందే తెలుసని తాజాగా జస్టిస్​ మురళీధర్​ తెలిపారు. ఫిబ్రవరి 17నే తనకు సమాచారం అందిందని స్పష్టం చేశారు. దిల్లీలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఫిబ్రవరి 17న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నుంచి సమాచారం అందింది. దిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్​-హరియాణా హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయం తీసుకుంది. పంజాబ్​- హరియాణా కోర్టుకు బదిలీ చేసినందుకు నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు."

--- జస్టిస్​. ఎస్.మురళీధర్​, న్యాయమూర్తి

దిల్లీ అల్లర్ల కేసులో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన కొందరు భాజపా నేతలపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన రోజు రాత్రి జస్టిస్​ మురళీధర్​ను పంజాబ్​-హరియాణా హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే.. ఇది సాధారణ బదిలీల్లో భాగమేనని, దీన్ని రాజకీయం చేయొద్దని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ తెలిపారు.

ఇదీ చదవండి: ఏడుగురు కాంగ్రెస్​ ఎంపీలపై సస్పెన్షన్​ వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.