70 కిలోల ఎండీఎంఏ(మిథైల్ ఎనిడియోక్సి మెథాంఫేటమిన్) డ్రగ్స్ సరఫరా కేసులో దొరికిన ఐదుగురు నిందితుల ఆస్తులపై ఈడీ దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ ఇందోర్ పోలీసులు కోరారు. ఈ డ్రగ్స్ సరఫరాలో మరికొందరి భాగస్వామ్యం ఉందని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరినారాయణ్ మిశ్రా తెలిపారు.
ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హరినారాయణ్ మిశ్రా... నిందితుల అక్రమాస్తులను గుర్తించేలా ఈడీ సోదాలు చేయాల్సిందని అవసరం ఉందన్నారు.
"నిందితులు భారీగా ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. ఐదుగురికి సంబంధించి కొన్ని అక్రమ ఆస్తులను గుర్తించే పనిలోనే ఉన్నాం. ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశాలున్నాయి".
-హరినారాయణ్ మిశ్రా, ఇందోర్ ఐజీపీ.
ఇదీ చదవండి:హైదరాబాద్ నుంచి డ్రగ్స్ రవాణా- 70 కిలోలు సీజ్
డ్రగ్స్ సరఫరా నిందితులకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పరిచయం ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. వీటిపై స్పందించిన మిశ్రా... ఇందోర్తో పాటు పలు ముఖ్యమైన పట్టణాలకు నిందితులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నారని వెల్లడించారు. దాదాపు 25 రోజుల కృషితో భారీ మొత్తంగా మాదకద్రవ్యాలను పట్టుకున్నట్లు వివరించారు. ముంబయి, దిల్లీ ప్రాంతాల్లో నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఈ డ్రగ్స్ వినియోగిస్తున్నారని చెప్పారు.
ప్రధాన నిందితుడు వేద్ ప్రకాశ్ వ్యాస్‌కు సంబంధించిన ఫార్మా కంపెనీలో హైదరాబాద్ పోలీసులు తనిఖీ చేసినట్లు మిశ్రా తెలిపారు.
ఇదీ చదవండి:'అజేయ' భారతం.. 'సూపర్ 50'తో సాధ్యం!