కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛత సర్వేలో దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది మధ్యప్రదేశ్ ఇండోర్. వరుసగా నాలుగోసారి క్లీనెస్ట్ సిటీగా ఘనత సాధించింది.
ఈ ఏడాది మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో నిర్వహించిన సర్వేలో పరిశుభ్రమైన నగరాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది మధ్యప్రదేశ్ భోపాల్. మూడో స్థానం గుజరాత్ సూరత్‌కు దక్కింది.
రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో నిర్వహించిన సర్వేలో పరిశుభ్రమైన నగరాల జాబితాలో గుజరాత్ రాజ్‌కోట్‌కు రెండో స్థానం దక్కగా, నవి ముంబయి మూడో స్థానంలో నిలిచింది.
ఇదీ చూడండి: కాలుష్యమే ఉష్ణోగ్రతల తగ్గుముఖానికి కారణం