ఆధిపత్య ప్రయత్నాలను తిప్పికొట్టడటమే 'ఇండో పసిఫిక్' భావన అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్యసమితి సహా కొందరి ప్రయోజనాల కోసం ప్రపంచం నిలిచిపోదని పునరుద్ఘాటించడమే దీని లక్ష్యమంటూ పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
గ్లోబల్ టౌన్ హాల్ కార్యక్రమంలో శుక్రవారం దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్న జైశంకర్.. ఇండో పసిఫిక్ గతాన్ని కాకుండా భవిష్యత్తును నిర్దేశిస్తుందన్నారు. ఈ ప్రాంతంలో చైనా సైనిక ప్రాబల్యం పెంచుకుంటోన్న నేపథ్యంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఇటీవలి కాలంలో ఇండో పసిఫిక్ భావనకు గుర్తింపు పెరుగుతోంది. దీనికి కార్యాచరణ రూపం ఇవ్వటానికి చతుర్భుజ కూటమి వంటి బహుళపాక్షిక సంబంధాలు దోహదపడుతాయి. ఈ ప్రాంతంలో ఆధిపత్యానికి తావు లేదు. కొందరి ప్రయోజనాల కోసం ప్రపంచం స్తంభించదు."
- జైశంకర్, విదేశాంగ మంత్రి
ఇదీ చూడండి: 'మలబార్'లో భారత్- అమెరికా ఫైటర్ జెట్ల విన్యాసాలు