ETV Bharat / bharat

'భారత్​-నేపాల్ వివాదం పరిష్కారానికి అదొక్కటే మార్గం'

ఒకప్పుడు బలమైన స్నేహ సంబంధాలు కలిగి ఉన్న భారత్-నేపాల్​ ఇప్పుడు లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాల విషయంలో తలెత్తిన వివాదంతో ప్రత్యర్థులుగా మారే పరిస్థితి నెలకొంది. దశాబ్దాల సత్సంబంధాలను తిరిగి పునరుద్ధరించాలంటే చర్చలతో సమస్యను పరిష్కరించుకోవడం తప్ప మరో మార్గం లేదని తెలిపారు సీనియర్​ విశ్లేషకులు యుబరాజ్​ ఘిమిరే. ఈ విషయంపై ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

Indo-Nepal cartographic tussle: No substitute to dialogue, says Nepalese political analyst
'భారత్​-నేపాల్ మధ్య గొడవ పరిష్కారానికి అదొక్కటే మార్గం'
author img

By

Published : Jun 24, 2020, 6:54 PM IST

భారత్​-నేపాల్​ మధ్య దశాబ్దాలుగా బలమైన స్నేహ సంబంధాలున్నాయి. సంస్కాృతి, సామాజిక, ఆర్థిక బంధాలు విడదీయరానివి. భారత్ తర్వాత అత్యధిక శాతం హిందువులు ఉన్నది కూడా నేపాల్​లోనే. ఇంతకాలం మిత్రదేశాలుగా ఇరు దేశాల మధ్య ఇప్పుడు దూరం పెరిగింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా తమ ప్రాంతాలని నేపాల్ ప్రకటించడం రెండు దేశాల మధ్య వివాదం రాజేసింది. ఆ ప్రాంతాలు తమ భూభాగంలో అంతర్భాగమని భారత్​ తేల్చిచెప్పింది. నేపాల్​ కొత్తగా రూపొందించిన మ్యాప్​ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ దేశంలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చాకే భారత్​పై వ్యతిరేకత మొదలైంది.

అయితే రెండు దేశాల మధ్య గతంలో ఉన్న సత్సంబంధాలను పునరుద్ధరించాలంటే చర్చలు తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని తెలిపారు సీనియర్​ విశ్లేషకులు యుబరాజ్​ ఘిమిరే. గత మూడు దశబ్దాలుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పరిశీలిస్తున్న ఆయన ఈటీవీ భారత్​తో పత్యేకంగా మాట్లాడారు. ఆర్టికల్​ 370 రద్దు చేసి​ కొత్త మ్యాప్​ విడుదల చేసినప్పటి నుంచే భారత్​పై నేపాల్​కు వ్యతిరేకత మొదలైందని వివరించారు.

నేపాల్​తో వివాదంపై విశ్లేషణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.