ETV Bharat / bharat

సరిహద్దుల్లో కాల్పులపై భారత్​- చైనా మాటల యుద్ధం

తూర్పు లద్దాఖ్​లో జరిగిన కాల్పుల ఘటనపై భారత్​, చైనా పరస్పరం నిందించుకున్నాయి. భారత బలగాలు​ సరిహద్దు దాటి అడ్డుకున్న సైనికులను బెదిరించేందుకు కాల్పులు జరిపినట్లు చైనా ఆరోపించింది. చైనా చేసిన ప్రకటనను భారత సైన్యం తీవ్రంగా ఖండించింది. చైనానే భారత స్థావరానికి దగ్గరగా వచ్చి.. కాల్పులకు దిగిందని ఆరోపించింది.

INDIA CHINA FIRING
భారత్​- చైనా
author img

By

Published : Sep 8, 2020, 1:12 PM IST

తూర్పు లద్దాఖ్​లో కాల్పులు జరిపారన్న చైనా ఆరోపణలను భారత సైన్యం తీవ్రంగా ఖండించింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఎలాంటి దూకుడు చర్యలకు దిగలేదని స్పష్టం చేసింది. చైనా చెబుతున్నట్లు సరిహద్దును దాటలేదని తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది భారత సైన్యం.

"ఇరు దేశాల మధ్య ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. ఓ వైపు సైనిక, దౌత్య, రాజకీయ స్థాయి చర్చలు జరుపుతూనే సైన్యాన్ని ముందుకు తోస్తోంది. సెప్టెంబర్​ 7న చైనా సైన్యం వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న ఓ భారత స్థావరానికి దగ్గరగా వచ్చింది. వారిని అడ్డుకునేందుకు భారత దళాలు ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో బెదిరింపులకు దిగిన చైనా సైన్యం గాల్లోకి కాల్పులు జరిపింది."

- భారత సైన్యం

చైనా రెచ్చగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, సంయమనం పాటించి పరిణితితో బాధ్యతాయుతంగా ప్రవర్తించామని భారత సైన్యం తెలిపింది. అయితే, తమ దేశంతో పాటు అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు చైనా వెస్టర్న్ కమాండ్ అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడింది.

సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నట్లు భారత సైన్యం స్పష్టం చేసింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని తేల్చిచెప్పింది.

చైనా ఆరోపణలు..

అంతకుముందు ఈ ఘటనపై చైనా సైన్యం వెస్టర్న్​ కమాండ్ సీనియర్ కల్నల్ జాంగ్ షియూలీ.. భారత్​పై ఆరోపణలు చేశారు. భారత్​ చొరబాటుకు ప్రయత్నించగా.. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు చైనా ప్రతిచర్యలకు దిగిందని అస్పష్ట ప్రకటన చేశారు.

"వాస్తవాధీన రేఖ వెంబడి పశ్చిమ ప్రాంతంలో భారత్ సైన్యం సరిహద్దును దాటింది. పాంగాంగ్​ సరస్సు దక్షిణ ఒడ్డున ఉన్న షెన్​పావ్​ పర్వత ప్రాంతంలోకి చొరబడింది. అడ్డుకున్న చైనా సైనికులను బెదిరించేందుకు కాల్పులు జరిపింది. ప్రతిగా చైనా సైన్యం స్పందించింది. దుందుడుకు చర్యలకు పాల్పడ్డ సైనికులను గుర్తించి భారత్​ శిక్షించాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి."

- జాంగ్​ షియూలీ, సీనియర్ కల్నల్

సరిహద్దుల్లో కాల్పులు..

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వద్ద కాల్పుల జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలో భారత్​-చైనా దళాల మధ్య మూడు నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.

పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరాన ఉన్న వ్యూహాత్మక ఎత్తును భారత్ ఇటీవల చేజిక్కించుకుంది. దీనితో పాంగాంగ్​ దక్షిణ తీరంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు చైనా ఇటీవల చేసిన ప్రయత్నాన్ని భారత్ సమర్థంగా అడ్డుకోగలిగింది. ఈ ఘటన తర్వాత కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తుండటం గమనార్హం.

ఇదీ చూడండి: తూర్పు లద్దాఖ్‌లోని ఎల్​ఏసీ వద్ద కాల్పులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.