గడిచిన కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రపంచంలోనే రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో భారత్‌లోనే అత్యధికంగా వెలుగుచూస్తున్నాయి. కొత్తగా 94 వేల 372 మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 47 లక్షల మార్కు దాటింది. మరో 1114 మంది ప్రాణాలు కోల్పోయారు.
పెరుగుతున్న పరీక్షలు...
కరోనా నిర్ధరణ పరీక్షలు భారీగా నిర్వహిస్తున్నారు. ఫలితంగానే దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 5 కోట్ల 62 లక్షల మందికిపై కొవిడ్ టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. శనివారం ఒక్కరోజే 10 లక్షల 71 వేల 702 నమూనాలను పరీక్షించారు.
గణనీయంగా రికవరీ...
దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 37 లక్షల మందికిపైగా కొవిడ్‌ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 77.88 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మరణాల రేటు 1.65 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. మరో 20.47 శాతం మంది చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ