మోదీ సర్కార్ విదేశాంగ విధానం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ ప్రతిష్ఠ మసకబారుతోందని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రతి చోట గౌరవం కోల్పోతున్నామని, అయినా ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కావడం లేదని ట్వీట్ చేశారు.
చాబహర్ నౌకాశ్రయం నుంచి అఫ్గానిస్థాన్ సరిహద్దు వెంబడి ఉన్న జహదన్ ప్రాంతం వరకు రైల్వే మార్గాన్ని భారత్‌కు బదులుగా ఇరాన్ ప్రభుత్వమే సొంతంగానే నిర్మించాలనుకుంటోందన్న వార్తల్ని ప్రస్తావిస్తూ ఈ విమర్శలు చేశారు రాహుల్.
-
India’s global strategy is in tatters. We are losing power and respect everywhere and GOI has no idea what to do.https://t.co/rEMuMnJhOx
— Rahul Gandhi (@RahulGandhi) July 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">India’s global strategy is in tatters. We are losing power and respect everywhere and GOI has no idea what to do.https://t.co/rEMuMnJhOx
— Rahul Gandhi (@RahulGandhi) July 15, 2020India’s global strategy is in tatters. We are losing power and respect everywhere and GOI has no idea what to do.https://t.co/rEMuMnJhOx
— Rahul Gandhi (@RahulGandhi) July 15, 2020
"భారత వీదేశీ వ్యూహం చిందరవందరగా ఉంది. మనం ప్రతి చోట గౌరవం, అధికారాన్ని కోల్పోతున్నాం. భారత ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియడం లేదు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
చైనా కారణమా?
చైనాతో ఆర్థిక, రాజకీయ సహకారానికి సంబంధించి ఇరాన్ ఓ ముసాయిదాను ఆమోదించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ మేరకు నిధుల జాప్యం పేరిట చాబహర్ ఓడరేవు ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పించడానికి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.
ఈ రైల్వే లైన్ నిర్మాణాన్ని చేపట్టేందుకు నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం ఇరాన్‌తో ఒప్పందం చేసుకుంది.
ఇదీ చదవండి-భారత్‌కు ఇరాన్ ఝలక్- చైనాతో సీక్రెట్ డీల్ వల్లే!