దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ అంబులెన్స్‌ను బెంగళూరులో ప్రారంభించారు. ఐసీఏటీటీ రూపొందించిన ఈ హెలికాప్టర్ అంబులెన్స్‌లో అత్యాధునిక వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మెట్రో నగరల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినప్పుడూ అత్యవసరంగా రోగులను, వైద్య నిపుణులను ఆస్పత్రులకు తరలించేందుకు దీనిని తయారు చేసినట్లు ఐసీఏటీటీ బృందం తెలిపింది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కరోనా రోగులను కూడా ఆకాశ మార్గంలో ఆస్పత్రికి తరలించనునట్లు పేర్కొంది.
ఎయిర్ అంబులెన్స్ సేవలు కేవలం బెంగళూరు నగరానికే పరిమితం కాకుండా...దక్షిణాది నగరాల్లోనూ అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వ్యవస్థ రోగులకు సాధారణ హెల్త్ కేర్ సెంటర్లు, మెరుగైన పెద్ద ఆసుపత్రులకు కనెక్టివిటీని పెంచుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అభిప్రాయపడ్డారు..
"అత్యవసర సమయాల్లో రోగులకు సకాలంలో చికిత్స అందించడం చాలా ముఖ్యం. ఐసీఏటీటీ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ అంబులెన్స్ సేవను ప్రారంభించింది వైద్య సహాయం అందించటం కోసమే కాకుండా, క్లిష్టమైన సమయాల్లో సీనియర్ వైద్యులు, మెడిసిన్ అందించే వైద్య సిబ్బంది కూడా విమానంలో ఉంటూ సేవలను అందిస్తారు.. " అని యడియూరప్ప అన్నారు.