బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న క్రమంలో కొవిడ్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్(ఎన్ఎఫ్టీ) శనివారం కీలక సమావేశం నిర్వహించింది. కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించి, వ్యాప్తిని అడ్డుకోవడం సహా పరీక్షలు, చికిత్స విధానాల్లో తేవాల్సిన మార్పులపై సమావేశంలో చర్చించింది. ఇందుకు ప్రత్యేకంగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆధ్వర్యంలో జన్యు పర్యవేక్షణ కన్సార్టియాన్ని ఎన్ఎఫ్టీ ఏర్పాటు చేసింది.
త్వరగా గుర్తించేందుకు..
ఇటీవల బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన 50 మంది నుంచి నమూనాలను సేకరించి, పరీక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5శాతం నమూనాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది. బ్రిటన్ నుంచి వ్యాపిస్తున్న కొత్త స్ట్రెయిన్ వైరస్‌ను మన దేశంలో త్వరగా గుర్తించేందుకు.. సమగ్ర జన్యు పర్యవేక్షణ ఉండాల్సిన అవసరముందని ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్ జన్యువుల్లో 8 రకాలుగా మ్యుటేషన్లు జరుగుతున్నట్లు వెల్లడించింది.
ఇప్పటివరకూ అందిస్తున్న కొవిడ్ చికిత్సలో ఏ విధమైన మార్పులు అవసరం లేదని కమిటీ అభిప్రాయపడింది. ఈ సమావేశానికి ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ బలరాం భార్గవ, నీతి అయోగ్ సభ్యుడు వినోద్ పాల్ ఎయిమ్స్ డైరెక్టర్, డీసీజీఐ ప్రతినిధులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: ఎందుకు కొవిడ్-19 అని పిలుస్తారు?