ETV Bharat / bharat

'కరోనా కేసులు, మరణాల రేటు భారత్​లో అత్యల్పం' - WHO situation report 168

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల రేటు అత్యల్పంగా ఉన్న దేశాల్లో భారత్​ ఒకటని పేర్కొంది కేంద్రం. ప్రతి 10 లక్షల మందిలో కేవలం 505 కేసులు, 14.27 మరణాలు ఉన్నట్లు తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తీసుకుంటున్న చర్యలతోనే ఇది సాధ్యమవుతోందని వెల్లడించింది.

India's COVID-19 tally
'కరోనా కేసులు, మరణాల రేటు భారత్​లో అత్యల్పం'
author img

By

Published : Jul 7, 2020, 7:52 PM IST

భారత్​లో కరోనా కేసుల సంఖ్య 7 లక్షల మార్కును దాటినప్పటికీ.. కేసులు, మరణాల రేటు తక్కువేనని ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మందిలో కేసులు, మరణాలు అత్యల్పంగా ఉన్న దేశాల్లో భారత్​ ఒకటని పేర్కొంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ జులై 6న విడుదల చేసిన కరోనా పరిస్థితి నివేదిక-168ని సూచిస్తూ.. భారత్​లో కేసుల సంఖ్య ప్రతి 10 లక్షల మందిలో 505.37గా ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సగటు 1,453.25గా ఉందని తెలిపింది.

వివిధ దేశాల్లో ప్రతి 10 లక్షల మందిలో కేసుల సంఖ్య ఇలా

దేశం

కేసులు

(ప్రతి 10 లక్షల జనాభాలో)

చిలీ15,459.8
పెరు9,070.8
అమెరికా8,560.5
బ్రెజిల్​ 7,419.1
స్పెయిన్ 5,358.7
రష్యా4,713.5
యూకే 4,204.4
ఇటలీ 3,996.1
మెక్సికో1,955.8

" డబ్ల్యూహెచ్​ఓ కరోనా పరిస్థితి నివేదిక ప్రకారం ప్రతి 10 లక్షల మందిలో మరణాల రేటు తక్కువగా ఉన్న దేశాల్లో భారత్​ ఒకటి. అది 14.27గా ఉంది. గ్లోబల్​ సగటు దానికి నాలుగు రెట్లకుపైగా 68.29గా ఉంది. యూకేలో 651.4, స్పెయిన్ ( 607.1), ఇటలీ(576.6), ఫ్రాన్స్​ (456.7), అమెరికా(391.0) పెరూ(315.8), బ్రెజిల్​ (302.3), మెక్సికో (235.5) మరణాలు ఉన్నాయి. కరోనా కట్టడి కోసం భారత్​ ఆస్పత్రి సౌకర్యాలను పెంచింది. ఆక్సిజన్​ సపోర్ట్​, ఐసీయూ, వెంటిలేటర్​ వంటివి సమకూర్చుకుంది. జులై 7 నాటికి దేశవ్యాప్తంగా 1,201 కొవిడ్​-19 ఆస్పత్రులు, 2,611 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, 9,909 శిబిరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్ని సమకూర్చుకున్న క్రమంలో రికవరీ రేటు మెరుగైంది. మరణాల రేటు తగ్గింది. త్వరితగతిగా కేసులను గుర్తించి చికిత్స అందిస్తున్న ఫలితంగా రోజువారీ రికవరీలు పెరుగుతున్నాయి."

- కేంద్ర ఆరోగ్య శాఖ

దేశవ్యాప్తంగా రికవరీ కేసుల సంఖ్య 4,39,947కు చేరినట్లు వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 63.13 శాతానికి చేరినట్లు తెలిపింది.

రోజుకు 2 లక్షలకుపైగా..

కేంద్రం తీసుకున్న వివిధ చర్యలతో పరీక్షలు, రోగులను గుర్తించటం, చికిత్సపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరింత సమర్థవంతంగా చర్యలు చేపట్టేలా చేసిందని పేర్కొంది ఆరోగ్య శాఖ. దాని ద్వారా రోజుకు 2 లక్షలకుపైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. మంగళవారం 2,41,430 నమూనాలు పరీక్షించామని.. ఇప్పటి వరకు మొత్తం 1,02,11,092 నమూనాలు పరీక్షించినట్లు తెలిపింది. పరీక్షా ల్యాబులను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం 793 ప్రభుత్వ, 322 ప్రైవేటు ప్రయోగకేంద్రాలు పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.