ETV Bharat / bharat

భారత్​లో కరోనా విజృంభణ-మహారాష్ట్రలో తీవ్రత అధికం

భారతదేశంలో కరోనా అంటువ్యాధి క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు ఈ మహమ్మారి సోకి దేశంలో 242 మంది మరణించారు. మహారాష్ట్రలో వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ఇవాళ ఒక్కరోజే 187 కొత్తకేసులు నమోదవగా, 17 మంది మృత్యువాతపడ్డారు.

india's corona death toll rises to 242.
తబ్లీగీ మూలంగా భారత్​లో పెరిగిపోతున్న కరోనా కేసులు
author img

By

Published : Apr 11, 2020, 10:15 PM IST

కరోనా వైరస్​ దేశంలో చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 242 మంది కరోనాకు బలయ్యారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు దేశంలో 7,529 కేసులు నమోదవగా.. వాటిలో 6,634 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 652 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

ముంబయిలో ఒక్కరోజే 189 కేసులు..

మహారాష్ట్రలో కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే.. 187 కొత్తకేసులు నమోదవగా 17 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1761కు చేరింది.

ఒక్క ముంబయిలోనే ఇవాళ 11 మంది కరోనాతో మరణించారు. నగరంలో మొత్తం కేసుల సంఖ్య 1182కి పెరిగింది.

పుణె: ఇవాళ మూడు కరోనా మరణాలు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం మరణాల సంఖ్య 29కి చేరింది.

తమిళనాడులో మరో 58..

తమిళనాడులోని ఈరోడ్​లో ఇవాళ ఓ వ్యక్తి కరోనాతో మరణించాడు. దీనితో రాష్ట్రంలోని మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. మరోవైపు ఇవాళ 58 మందికి కరోనా కేసులు నమోదుకాగా.. మొత్తం బాధితుల సంఖ్య 969కి చేరినట్లు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి షణ్ముగం వెల్లడించారు.

గుజరాత్​ మరో 54 కొత్త కేసులు

గుజరాత్​లో ఇవాళ 54 కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీనితో మొత్తం బాధితుల సంఖ్య 432కు పెరిగింది.

ఒడిశాలో 37 యాక్టివ్​ కేసులు...

ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య 50కి చేరిందని వెల్లడించారు అధికారులు. ఒకరు మరణించగా.. ప్రస్తుతం 37 యాక్టివ్​ కేసులున్నట్లు తెలిపారు. మరో 12 మంది వ్యాధి నుంచి బయటపడ్డారు.

దిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. నగరంలో మొత్తం కేసుల సంఖ్య 1069కి చేరగా, మృతుల సంఖ్య 19కి పెరిగింది.

చాందీ మహల్ ప్రాంతంలోని మసీదుల్లో ఉంటున్న 102 మంది వ్యక్తుల్లో 52 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. వీరిలో చాలా మంది తబ్లీగీ ప్రార్థనల్లో పాల్గొన్నవారే కావడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్​: ఇవాళ వెలుగుచూసిన 15 కొత్త కేసులతో.. మొత్తం బాధితుల సంఖ్య 448కి చేరింది.

కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 8 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 215కి చేరింది.

పంజాబ్​: మొత్తం కేసులు 158కి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 12 మంది కొవిడ్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

కేరళ: ఇవాళ మరో 10 కేసులతో.. మొత్తం బాధితుల సంఖ్య 373కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 228 యాక్టివ్​ కేసులున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్​ తెలిపారు.

మధ్యప్రదేశ్​: ఇండోర్​లో ఇవాళ ముగ్గురు కరోనాతో మరణించారు. దీనితో ఈ నగరంలో కరోనా చనిపోయిన వారి సంఖ్య 30కి చేరింది.

ఝార్ఖండ్: ఈ రోజు కొత్తగా మూడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 17కి చేరింది.

జమ్ము కశ్మీర్​: నేడు మరో 17 మందికి కరోనా సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 224కి చేరింది.

హిమాచల్​ప్రదేశ్​: ఇవాళ రెండు కొత్త పాజిటివ్​ కేసులు నమోదు అయ్యాది. దీనితో మొత్తం కేసుల సంఖ్య 32కి పెరిగింది.

ఆంధ్రప్రదేశ్​: ఈ రోజు మరో 24 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 405కు చేరింది. 11 మంది డిశ్చార్జి కాగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తరాఖండ్​: ఇవాళ కరోనా కేసులేమీ నమోదుకాలేదు. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 35గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి: 'లాక్​డౌన్​ లేకపోతే ఈపాటికి 8 లక్షల కేసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.