ETV Bharat / bharat

దేశంలో మరోసారి 8లక్షల దిగువకు యాక్టివ్​ కేసులు - కొవిడ్​ రికవరీ రేటు

దేశంలో కొవిడ్​ విజృంభణ తగ్గినట్టే కనిపిస్తోంది. మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 7.95 లక్షలకు చేరింది. ఒక్కరోజులోనే సుమారు 70వేల మందికిపైగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఫలితంగా మొత్తం రికవరీల సంఖ్య 65లక్షలు దాటింది.

India's active COVID-19 caseload drops below 8 lakh after one-and-half months
దేశంలో 8లక్షల దిగువకు చేరిన కరోనా యాక్టివ్​ కేసులు
author img

By

Published : Oct 17, 2020, 12:41 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యాక్టివ్​ కేసుల సంఖ్య ఎనిమిది లక్షలకు దిగువకు చేరడమే ఇందుకు నిదర్శనం. సెప్టెంబర్​ 1న 7.85లక్షల క్రియాశీల కేసులుండగా.. దాదాపు నెలన్నర తర్వాత ఆ సంఖ్య 7,95,087కు చేరింది. మొత్తం కేసుల సంఖ్యలో ఇది 10.7 శాతంగా ఉంది.

రోజూవారి రికవరీల సంఖ్య స్థిరంగా పెరుగుతుండటం వల్ల.. యాక్టివ్​ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపింది ఆరోగ్య శాఖ. శుక్రవారం ఒక్కరోజే 70,816 మంది వైరస్​ను జయించగా.. మొత్తం రికవరీల సంఖ్య 65లక్షల 24వేల 595కు చేరింది. ఫలితంగా దేశవ్యాప్త కరోనా రికవరీ రేటు 87.78శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.52శాతంగా నమోదైంది.

ఇదీ చదవండి: దేశంలో 62 వేల కొత్త కేసులు.. 837 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.