ETV Bharat / bharat

భారత​ 'పులుల గణన'కు​ గిన్నిస్ రికార్డ్​లో చోటు - పులుల సర్వే

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​లో భారత్​ చేపట్టిన 'పులుల గణన - 2018' చోటు దక్కించుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వన్యప్రాణుల సర్వేగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

India's 2018 Tiger Census makes it to Guinness Book of World Records
భారత​ 'పులుల గణన'కు​ గిన్నిస్​బుక్​లో చోటు
author img

By

Published : Jul 11, 2020, 4:29 PM IST

భారతదేశంలో 2018లో చేపట్టిన పులుల గణన... ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వన్యప్రాణుల సర్వేగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు దక్కించుకుంది.

గతేడాది ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఆల్​ ఇండియా టైగర్ ఎస్టిమేషన్​ 2018 నాలుగో విడత గణాంకాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీని ప్రకారం, భారత్​లో 2,967 పులులు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని మొత్తం పులుల్లో 75 శాతం భారత్​లోనే ఉన్నాయి.

"అఖిల భారత పులుల అంచనా ఇప్పుడు.. ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ట్రాప్ వన్యప్రాణి సర్వేగా గిన్నిస్​ బుక్​లో చోటు దక్కించుకుంది. ఇది ఓ గొప్ప క్షణం. ఆత్మ నిర్భర్ భారత్​కి​ ప్రకాశవంతమైన ఉదాహరణ."

- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర పర్యావరణశాఖ మంత్రి

సంకల్ప సిద్ధి..

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో... పులుల సంఖ్యను రెట్టింపు చేయాలనే 'సంకల్ప్ సే సిద్ధి' లక్ష్యాన్ని నాలుగేళ్ల ముందే చేరుకున్నట్లు జావడేకర్ పేర్కొన్నారు.

'గిన్నిస్' వెబ్​సైట్ ప్రకారం

"2018-19లో భారత్​లో చేపట్టిన పులుల సర్వే వనరుల పరంగా, డేటా పరంగా చాలా సమగ్రమైనది. కెమెరా ట్రాప్స్​ను 141 వేర్వేరు సైట్లలో... 26,838 ప్రదేశాల్లో ఏర్పాటుచేశారు. ఈ కెమెరాల్లో ఏర్పాటు చేసిన మోషన్ సెన్సార్ వల్ల జంతువుల కదలికలు పూర్తిగా రికార్డు చేయగలిగారు. ఫలితంగా సుమారు 1,21,337 చదరపు కి.మీ. మేర సమగ్రమైన సర్వే చేయగలిగారు. "

- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్​సైట్

ఈ కెమెరా ట్రాప్​ వల్ల మొత్తంగా.. 3,48,58,623 వన్యజీవుల చిత్రాలను సేకరించగలిగారు. ఈ ఫొటోల్లో 76,651 పులులు, 51,777 చిరుతపులులు, మిగిలినవి ఇతర జీవులు. ఈ సాఫ్ట్​వేర్​ ద్వారా మొత్తంగా 2,461 పులులను (కూనలు మినహాయిస్తే) గుర్తించారు.

ఇదీ చూడండి: ఒకటే వేదిక.. వరుడొక్కడు.. వధువులిద్దరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.