దేశ వ్యాప్తంగా పలు రైల్వే మార్గాల్లో రద్దీని నియంత్రించే పనులను చేపట్టినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. రద్దీగా ఉన్న మార్గాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
'ఇప్పటివరకు మొత్తం 7 'హై- డెన్సిటీ నెట్వర్క్(హెచ్డీఎన్)' మార్గాలను గుర్తించాం. 11,295 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం గుండా సుమారు 60 శాతం ట్రాఫిక్‌తో తీవ్ర సమస్య ఏర్పడుతోంది. అందువల్ల ఈ రద్దీని నియంత్రించేందుకు తగిన చర్యలు చేపడుతున్నాం.'
- వినోద్ కుమార్ యాదవ్, భారతీయ రైల్వే ఛైర్మన్
2024 నాటికి రెట్టింపే లక్ష్యం..
అంతేకాకుండా 2024 మార్చి నాటికి సుమారు 34,642 కిలోమీటర్ల పొడవైన హెచ్డీఎన్, హెచ్‌యూఎన్ మార్గాలను విద్యుద్దీకరణ చేస్తున్నట్లు తెలిపారు వినోద్. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పిన వినోద్.. ఒప్పంద(కాంట్రాక్ట్) విధానాలను పూర్తిగా సవరించామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆన్లైన్ డ్రాయింగ్స్ అప్రూవల్ పోర్టల్(ఈ-డాష్) కార్యరూపం దాల్చిందన్న ఆయన.. ఇప్పటికే పలు కాంట్రాక్ట్‌లు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బురదలో కూరుకుపోయి ప్రాణాలు విడిచిన 'గజరాజు'