ఆరు వేలకుపైగా రైల్వే స్టేషన్లలో సెప్టెంబర్‌నాటికి వైఫై సదుపాయం కల్పించనున్నట్లు అ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దిల్లీలో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారాయన.
6,441 స్టేషన్లలో వైఫై సదుపాయం కల్పించనున్నాం. హాల్ట్ స్టేషన్లు మినహా ప్రతి స్టేషన్లోనూ ఈ సౌకర్యం కల్పిస్తాం. రైల్‌టెల్ ఈ ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షించనుంది. 160 సంవత్సరాల రైల్వే చరిత్రలో ఇది ఓ పెద్ద సామాజిక బాధ్యతా కార్యక్రమం. దీనికి భారీగా నిధులు అందించనున్న టాటా ట్రస్ట్‌కు కృతజ్ఞతలు- పీయూష్ గోయల్, రైల్వే శాఖ మంత్రి
వివిధ స్టేషన్లలో 2వేల 400 మూత్రశాలలు నిర్మించనున్నట్లు పీయూష్ గోయల్ తెలిపారు. తక్కువ ధరకు శానిటరీ ప్యాడ్స్ అందించేందుకు స్టేషన్ పరిసరాల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.