భారత నావికా దళం మంగళవారం నుంచి రెండు రోజుల పాటు మెగా డ్రిల్ నిర్వహించనుంది. దేశంలో 7,516 కిలోమీటర్ల మేర సముద్ర తీరం, ప్రత్యేక ఆర్థిక జోన్లను కలిగి ఉన్న 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విన్యాసాలు చేపట్టనుంది.
'సీ విజిల్-21' పేరుతో ఈ రక్షణ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నేవీ తెలిపింది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ట్రోపెక్స్ విన్యాసాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొంది. వీటి ద్వారా తీరప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించవచ్చని చెప్పింది.