ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ పరిమిత సంఖ్య అతిథుల మధ్య త్రివర్ణ జెండాకు గౌరవ వందనం చేశారు మోదీ.
అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. ఈ వేడుకకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ సహా మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు.
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ 1998-2003 మధ్య కాలంలో వరుసగా ఆరుసార్లు ఎర్రకోటపై త్రివర్ణ జెండాను ఎగురవేశారు. తాజాగా ఆ రికార్డును మోదీ తిరగరాశారు.
ఇవీ చూడండి:- రాజ్‌ఘాట్‌కు మోదీ- మహాత్ముడికి నివాళి