కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎమ్ఈఐటీవై) మంత్రిత్వ శాఖ ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా కరోనా సోకిన వారిని ట్రాక్ చేయడమే కాకుండా.. వారిని కలిసిన వారినీ గుర్తుపట్టవచ్చని ఎమ్ఆఐటీవై స్పష్టం చేసింది. ఈ 'కరోనా కవచ్' యాప్‌కు సంబంధించిన బీటా వర్షన్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌కు అందుబాటులో ఉంది. ఐఓఎస్‌లోనూ యాప్ తీసుకురావడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
యూజర్లు సందర్శించిన ప్రాంతాలను గుర్తించడానికి జీపీఎస్ సహాయం తీసుకుంటుంది యాప్. అనంతరం ఆ ప్రాంతంలో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల డేటాను పరిశీలిస్తుంది. ఒకవేళ ఏవైనా కేసులుంటే.. వెంటనే యూజర్‌ను అప్రమత్తం చేస్తుంది.
ఆరోగ్యం పరంగా వివిధ రంగులతో పరిస్థితులను యాప్ సూచిస్తుందిలా.
- గ్రీన్- అంతా బాగుంది.
- బ్రౌన్- వైద్యుడిని సంప్రదించండి.
- ఎల్లో- తక్షణమే క్వారంటైన్ అవ్వండి.
- రెడ్- కరోనా పాజిటివ్ కేసు.
ఫోన్ నంబరుతో లాగిన్...
ఈ యాప్‌ను ఉపయోగించడానికి ముందుగా చరవాణి నంబరుతో లాగిన్ అవ్వాలి. కొవిడ్-19 అనుమానితులను గుర్తించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. అయితే దీనిలో ప్రాథమిక సమాచారం మాత్రమే అందుబాటులో ఉంటుందని.. అలా కాకుండా మరింత సమాచారం ఉంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా త్వరలోనే ఓ యాప్‌ను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
ఇదీ చదవండి: ట్విట్టర్లో మోదీ త్రీడీ యోగా క్లాసులు