ETV Bharat / bharat

'2030 కల్లా 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమే' - రామ్​మాధవ్​తో ప్రత్యేక ముఖాముఖి

5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి కరోనా అవరోధంగా మారిందన్నారు భాజపా ప్రధాన కార్యదర్శి రామ్​మాధవ్​. భవిష్యత్​లో ఆ లక్ష్యాన్ని సుసాధ్యం చేస్తామని ఉద్ఘాటించారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలను వేగవంతం చేసి వచ్చే త్రైమాసికం నుంచే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటామని తెలిపారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. 2030 కల్లా 10 ట్రిలియన్​ డాలర్ల లక్ష్యంతో పనిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Ram Madhav
రామ్​మాధవ్​
author img

By

Published : Jun 4, 2020, 1:23 PM IST

Updated : Jun 4, 2020, 6:09 PM IST

మోదీ ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలను తప్పకుండా అందుకుంటామని భాజపా ప్రధాన కార్యదర్శి రామ్​మాధవ్​ స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం ఆటంకం కలిగించినా.. 2025 కల్లా భారత్​ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని అగ్రభాగాన నిలబెడతామన్నారు.

ఈటీవీ భారత్​తో ప్రత్యేక ముఖాముఖిలో మాట్లాడిన రామ్​మాధవ్​.. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మోదీ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుందని తెలిపారు.

రామ్​ మాధవ్​తో ముఖాముఖి- 1

"5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు భారత్​ పరుగులు పెడుతోంది. ఈలోగా ఒక అవరోధం ఏర్పడింది. కరోనా వైరస్ కారణంగా నెమ్మదించిన మాట వాస్తవం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. 2025 వరకు ఈ లక్ష్యాన్ని సాధిస్తామనే విషయంపై మీకు సందేహాలు ఉండవచ్చు. కానీ తప్పకుండా నెరవేర్చుతాం. అంతేకాదు, 2030 వరకు 10 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని సాధిస్తాం. ప్రభుత్వం విధానాలను వేగవంతం చేసి రాబోయే త్రైమాసికంలో ఈ ఆటంకాన్ని అధిగమిస్తుంది."

- రామ్​మాధవ్​, భాజపా ప్రధాన కార్యదర్శి

జమ్ము కశ్మీర్​పై..

జమ్ముకశ్మీర్​ స్వయంప్రతిపత్తి రద్దు విషయంలో భాజపా కొత్తగా చేసిందేమీ లేదని రామ్​ మాధవ్​ తెలిపారు. 50 ఏళ్లుగా ఈ డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ప్రతి విషయంలోనూ బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. జమ్ముకశ్మీర్​ ప్రజల ప్రయోజనాల కోసం కొత్త వలస విధానాన్ని కేంద్రం ఆమోదించినట్లు తెలిపారు.

రామ్​ మాధవ్​తో ముఖాముఖి- 2

ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 24 మంది నేతలు నిర్బంధంలో ఉన్నారు. ఇప్పటికే ఒమర్ అబ్దుల్లా విడుదలైనా.. పరిస్థితులు చక్కబడగానే మిగతా వారిని వదిలేస్తామని తెలిపారు.

చైనా దూకుడుపై..

చైనాతో భారత్​ దాదాపు 3,500 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు సహజమని రామ్​మాధవ్ తెలిపారు.

రామ్​ మాధవ్​తో ముఖాముఖి- 3

"పదేళ్లుగా చూస్తే చైనా దాదాపు 1,000 సార్లు వాస్తవాధీన రేఖ దాటేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అయితే చైనా మరింత దూకుడు పెంచింది. మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సరిహద్దు వివాదాలకు సంబంధించి కఠినంగా వ్యవహరిస్తున్నాం. వివాదాల పరిష్కారానికి దౌత్య మార్గంలో ప్రయత్నిస్తున్నాం. ఒక్క అంగుళం కూడా ఇతరులకు అప్పగించేందుకు సిద్ధంగా లేము. భారత సార్వభౌమ భూభాగంపై సైన్యం అడ్డుగోడగా నిలబడింది. డోక్లాం విషయంలో ఇదే జరిగింది. "

- రామ్​మాధవ్​, భాజపా ప్రధాన కార్యదర్శి

పాక్​కు అవకాశం ఇవ్వం..

తూర్పు సరిహద్దులో పరిస్థితులను ఆసరాగా చేసుకుని పాక్​ చేసే చొరబాటు ప్రయత్నాలను కూడా దృష్టిలో పెట్టుకున్నామని రామ్​ మాధవ్ తెలిపారు. పశ్చిమ సరిహద్దులోనూ సైన్యం చాలా అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఒక్క రోజులోనే 14 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని.. కశ్మీరులు కూడా తీవ్రవాదులకు మద్దతు ఇవ్వటం లేదని ఆయన అన్నారు. అక్కడి ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని.. వారి ఆశలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

ఏపీ సమస్యలపై..

"ఆంధ్రప్రదేశ్​ విషయానికి వస్తే చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్నికల కమిషనర్​ను హఠాత్తుగా తొలగించి కొత్త వారిని నియమించటం, తితిదే ఆస్తుల అమ్మకం.. ఇలా అనేక వివాదాలు ఉన్నాయి. వీటిపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. మా పార్టీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందని" రామ్​మాధవ్ స్పష్టం చేశారు.

Last Updated : Jun 4, 2020, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.