భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను భారత దౌత్యాధికారులు ఇవాళ కలవనున్నారు. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం అవకాశం ఇచ్చినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం మరణ శిక్ష విధించిన కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు షరతుల్లేకుండా అనుమతి ఇవ్వాలని పాకిస్థాన్‌ను కోరింది భారత్. తనకు విధించిన మరణిశిక్షపై సమీక్షా పిటిషన్‌ను దాఖలు చేసేందుకు కుల్‌భూషణ్ నిరాకరించినట్లు పాక్ ఇటీవల ప్రకటించిన తరుణంలో భారత్ ఈ మేరకు స్పందించింది.
"గత సారి కుల్‌భూషణ్‌ను కలవటానికి వెళ్లిన ఆయన భార్య, తల్లిదండ్రుల పట్ల పాక్ ప్రవర్తించిన తీరు అవమానకరంగా ఉంది. దౌత్య సహాయం షరతులు లేకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం."
-కుల్‌భూషణ్ చిన్ననాటి స్నేహితుడు
పాక్ కిడ్నాప్...
గూఢచర్యం ఆరోపణలతో 2016లో ఇరాన్ నుంచి జాదవ్‌ను పాక్ ఏజెంట్లు అపహరించారు. బలూచిస్థాన్లోకి ప్రవేశించినట్లు ఆరోపణలు మోపుతూ అరెస్టు చేశారు. 2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్ సైనిక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. అయితే ఇరాన్‌లో ఉంటున్న జాదవ్‌ను పాక్ కిడ్నాప్ చేసిందని భారత్ ఆరోపించింది.
పాక్ విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది భారత్. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2017 మే 18న జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది.