ETV Bharat / bharat

భారత సైన్యం ప్రతీకారం- ఐదుగురు పాక్ జవాన్లు హతం! - indian army attack pak

కశ్మీర్ సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇద్దరు జవాన్లు, ఓ పౌరుడ్ని బలిగొన్న పాక్​కు.. గట్టి జవాబు ఇచ్చింది భారత సైన్యం. పీఓకేలోని ఉగ్రస్థావరాలపై ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ ప్రతీకార దాడిలో నలుగురైదుగురు పాక్ జవాన్లు హతమైనట్లు సమాచారం.

భారత సైన్యం ప్రతీకారం
author img

By

Published : Oct 20, 2019, 1:00 PM IST

పాక్ దుర్నీతికి దీటుగా బదులిస్తోంది భారత్​. కశ్మీర్​లో కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి ఇద్దరు జవాన్లు, ఓ పౌరుడిని బలిగొన్న దాయాది దేశ చర్యకు ప్రతీకారంగా.. పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది.

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని నీలం లోయలో ఉన్న ఉగ్రశిబిరాలపై కాల్పులు జరిపి 4 స్థావరాలను ధ్వంసం చేసింది భారత సైన్యం. ఈ ఘటనలో నలుగురు లేదా ఐదుగురు పాక్ జవాన్లు మరణించారని తెలిసింది. అనేక మంది గాయపడ్డారు. పలువురు తీవ్రవాదులూ చనిపోయినట్లు సమాచారం. దాయాది దేశానికి భారీ ఆస్తినష్టం జరిగింది.

ఉదయం నుంచే...

ఉదయం నుంచి కశ్మీర్​ టాంగ్​ధర్​ సెక్టార్​లో ఉద్రిక్తత నెలకొంది. ఉగ్రవాదుల చొరబాటుకు పాక్ సహకరిస్తూ... కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పొరుగు దేశం దాడిలో ఇద్దరు భారతీయ జవాన్లు, ఒక పౌరుడు మృతిచెందారు. ముగ్గురు గాయపడ్డారు. పాక్​ దాడిలో ఓ ఇల్లు, రైస్​మిల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 19 ఎద్దులు, గొర్రెలు ఉన్న రెండు షెడ్లు నేలమట్టమయ్యాయి. రెండు కార్లు దెబ్బతిన్నాయి.

జవాన్ల మృతిని తీవ్రంగా పరిగణించింది భారత సైన్యం. గంటల వ్యవధిలోనే పాక్​పై ప్రతీకార దాడికి దిగింది.

ఇదీ చూడండి: ఆ పిల్లాడిని చూసి మృత్యువు పారిపోయింది!

Manila (Philippines), Oct 20 (ANI): President Ram Nath Kovind unveiled Mahatma Gandhi's bust in Philippines' Manila. He unveiled Father of the Nation's bust at Centre of peace education at Marian College. President of India earlier addressed India Philippines Business Conclave in Manila. President Kovind is on a 5-day visit to Southeast Asian country.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.