పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను మీడియా ముందు ప్రవేశపెట్టింది భారత సైన్యం. వారికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తుండగా తీసిన వీడియోను ప్రదర్శించారు. లోయలో పాక్ ఉగ్రదాడులకు సిద్ధమయిందని స్పష్టం చేసింది భారత సైన్యం.
ఈ వీడియోలో వారి శిక్షణ, సంస్థ, ప్రణాళికలకు సంబంధించిన వివరాలు తెలిపారు ముష్కరులు. వీరిని ఆగస్టు 21న కశ్మీర్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
-
#WATCH SRINAGAR: Indian Army releases confession video of two Pakistani nationals, who are associated with Lashkar-e-Taiba, and were apprehended on August 21. #JammuAndKashmir pic.twitter.com/J57U3uPZBl
— ANI (@ANI) September 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH SRINAGAR: Indian Army releases confession video of two Pakistani nationals, who are associated with Lashkar-e-Taiba, and were apprehended on August 21. #JammuAndKashmir pic.twitter.com/J57U3uPZBl
— ANI (@ANI) September 4, 2019#WATCH SRINAGAR: Indian Army releases confession video of two Pakistani nationals, who are associated with Lashkar-e-Taiba, and were apprehended on August 21. #JammuAndKashmir pic.twitter.com/J57U3uPZBl
— ANI (@ANI) September 4, 2019
అంతకు ముందు లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ మాట్లాడారు. ఇటీవల కశ్మీర్ సౌరాలో రాళ్ల దాడిలో గాయపడిన అస్రార్ అహ్మద్ ఖాన్ మరణించినట్లు తెలిపారు. గడిచిన 30 రోజుల్లో ఇది ఆరవ మరణమని తెలిపారు. ఈ మరణాలన్నీ ఉగ్రవాదుల కారణంగానే సంభవించాయన్నారు.
అహ్మద్ మరణంతో శ్రీనగర్‌లో ఆందోళనలు చెలరేగే అవకాశమున్నందున పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు విధించారు అధికారులు.
ఇదీ చూడండి: అంతర్జాతీయ కోర్టులో 'కశ్మీర్'పై చేతులెత్తేసిన పాక్!