ETV Bharat / bharat

సరిహద్దు ఉద్రిక్తం- ఇరువైపులా వెయ్యిమంది మోహరింపు

author img

By

Published : Jun 22, 2020, 6:18 PM IST

భారత్- చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరు దేశాలు భారీ స్థాయిలో ఆయుధ సామగ్రి, యుద్ధ ట్యాంకులను సరిహద్దుకు చేరవేస్తున్నాయి. చైనా దాడులకు తెగబడితే ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్ధమవుతున్నాయి. సరిహద్దు పరిస్థితిపై అగ్రశ్రేణి కమాండర్లతో చర్చించారు సైనికాధిపతి నరవాణె.

indo china
సరిహద్దు ఉద్రిక్తత.. ఇరుపక్కలా వెయ్యిమంది మోహరింపు

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత అంతకంతకూ పెరుగుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు వేడెక్కుతున్నాయి. తాజాగా భారత్‌, చైనా బలగాలు పెద్ద ఎత్తున చేరాయి. ఇరు వైపుల వెయ్యిమందికి పైగా బలగాలు మోహరించినట్లు సమాచారం. గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌-14 (పీపీ-14), పాంగాంగ్‌ టీఎస్‌ఓ వద్ద ఇరు దేశాల సైనికులు వచ్చి చేరుతున్నారు. కీలక ప్రాంతాల్లో భారత్‌-చైనా ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేసుకుంటున్నాయి.

అన్ని అవకాశాలను పరిశీలిస్తున్న భారత్‌

చైనా నుంచి ఎటువంటి దాడులు జరిగినా అడ్డుకునేందుకు భారత్‌ తనకున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. పాంగాంగ్‌ టీఎస్‌ఓ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయేలా స్పెషల్‌ ఆపరేషన్‌ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫింగర్‌ 4 ప్రాంతం వద్ద పరిస్థితి భారత్‌ అదుపులోనే ఉంది. ఆ ప్రాంతంలో చైనా భారీగా దళాలను మోహరిస్తుండగా, అదే స్థాయిలో భారత్‌ తన శిబిరంలోనూ సైనికులను రంగంలోకి దించుతోంది.

ఎల్‌ఏసీలో ప్రత్యేక దళాలు

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి చైనా ఎలాంటి దురాక్రమణలు చేయకుండా ఉండేందుకు భారత్‌ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 3,488 కి.మీ. మేర ఉన్న ఎల్‌ఏఈ వెంబడి ప్రత్యేక దళాలను రంగంలోకి దించింది.

సైనికాధిపతి నరవాణె ప్రత్యేక సమావేశం..

సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో సైన్యాధిపతి ఎంఎం నరవాణె.. అగ్రశ్రేణి కమాండర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కమాండర్లతో తొలిదఫా భేటీ అయిన నరవాణె.. తాజాగా రెండోసారి భేటీ అయ్యారు. సైనికాధిపతితో సమావేశం నేపథ్యంలో ఉన్నతస్థాయి కమాండర్లంతా ప్రస్తుతం దిల్లీలోనే ఉన్నారు.

పితోర్​గఢ్​ వద్ద భద్రత పెంపు..

గల్వాన్​ లోయ ఘర్షణ అనంతరం సరిహద్దు భద్రతపై దృష్టి సారించింది సైన్యం. నేపాల్, చైనాతో సరిహద్దుల వద్ద పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ఉత్తరాఖండ్​ పితోర్​గఢ్ జిల్లా దర్చులా వద్ద భద్రతను పెంచింది. సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు దర్చులాకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

జూన్ 21న ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ దళాలు లిపులేక్​ వద్ద భద్రతను పటిష్టం చేశాయి. 24 గంటలు పహారా కాస్తున్నాయి.

ఇదీ చూడండి: రష్యాకు రాజ్​నాథ్​- అత్యవసర యుద్ధ సామగ్రి కోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.