సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా కార్పరల్ వాంగ్ యా లాంగ్‌ను చైనాకు అప్పగించింది భారత సైన్యం. చుషూల్ మోల్డో మీటింగ్ పాయింట్ వద్ద చైనా సైనికుణ్ని మంగళవారం రాత్రి పీఎల్‌ఏకు అప్పగించినట్లు సైన్యం వెల్లడించింది.
తూర్పు లద్దాఖ్‌లో దెమ్‌చోక్ వద్ద వాంగ్ యా లాంగ్‌ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. అతని వద్ద పౌర, సైన్యానికి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ సైనికుడు గూఢచారిగా భారత్‌కు వచ్చారా? లేక మరేదైనా ప్రణాళికతో వచ్చారా అనే అంశంపై భారత సైన్యం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ప్రోటోకాల్‌ను అనుసరించి వాంగ్‌ను చైనాకు అప్పగిస్తామన్న సైన్యం...ఆ మేరకు మాట నిలబెట్టుకుంది.
ఇవీ చూడండి: 'మా జవాను త్వరగా తిరిగొస్తాడని ఆశిస్తున్నాం'