ETV Bharat / bharat

'చైనా దూకుడుకు కళ్లెం వేసే శక్తి భారత్​కు ఉంది'

Indian armed forces will have to be prepared
యుద్ధ సన్నద్ధతపై సీడీఎస్​ రావత్​ కీలక వ్యాఖ్యలు
author img

By

Published : Sep 3, 2020, 6:16 PM IST

Updated : Sep 3, 2020, 7:02 PM IST

18:57 September 03

వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో.. త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకుని సన్నద్ధులు కావాలన్నారు.

ఉత్తర, పశ్చిమ సరిహద్దుల నుంచి దేశానికి సవాళ్లు ఎదురవుతున్నాయని అభిప్రాయపడ్డ రావత్​.. వాటిని దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు రచించుకోవాలని సూచించారు.

పాక్​ ఆక్రమిత కశ్మీర్​కు చైనా ఇస్తున్న ఆర్థిక సహాయం, పాకిస్థాన్​కు చైనా సైనిక, దౌత్య పరంగా మద్దతిస్తోందని రావత్​ వెల్లడించారు. ఇదే సమయంలో జమ్ముకశ్మీర్​లో అలజడులు సృష్టించడానికి ఉగ్రవాదులను భారత్​లోకి పంపి.. పాకిస్థాన్​ ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రారంభించిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులకైనా​ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు త్రివిధ దళాధిపతి.

'ఆ శక్తి మాకు ఉంది...'

చైనా దుకుడు చర్యలను భారత్​ చూస్తూనే ఉందని.. వాటిని తిప్పికొట్టే శక్తిసామర్థ్యాలు దేశ త్రివిధ దళాలకు ఉన్నాయని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు రావత్.

మళ్లీ మొదటికి...

చైనా ప్రవర్తనతో సరిహద్దులో మే నెల నుంచి యుద్ధ వాతావరణం నెలకొంది. గల్వాన్​ లోయలో జరిగిన హింసాత్మక ఘటనతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఆయితే ఆ తర్వాత జరిగిన చర్చలతో పరిస్థితులు సద్దుమణిగాయి. పరిస్థితులు పూర్తి స్థాయిలో చల్లబడ్డాయనుకున్న సమయంలో.. చైనా మరోమారు తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. గత నెల 29-30 మధ్యరాత్రి.. భారత భూభాగంలో దురాక్రమణకు పాల్పడేందుకు ప్రయత్నించింది. అయితే దాన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్దింది.

18:11 September 03

యుద్ధ సన్నద్ధతపై సీడీఎస్​ రావత్​ కీలక వ్యాఖ్యలు

చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో భవిష్యత్​లో ఎదురయ్యే సవాళ్లనూ అధిగమించేందుకు సర్వసన్నద్ధులై ఉండాలని సూచించారు. 

ప్రస్తుతం భారత్​ ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో సవాళ్లు ఎదుర్కొంటోందని చెప్పారు రావత్. వాటిని దృష్టిలో పెట్టుకుని రక్షణ వ్యూహాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Last Updated : Sep 3, 2020, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.