అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును అమెరికాలోని ప్రవాస భారతీయులు స్వాగతించారు. దశాబ్దాల నుంచి కొనసాగుతున్న భూవివాదానికి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో.. హిందూ ముస్లిం ఇరువర్గాలకు న్యాయం జరిగిందని అభివర్ణించారు.
ప్రవాస భారతీయుల స్పందనలు:
"అత్యున్నత న్యాయస్థానం తీర్పు హిందూ-ముస్లిం ఇరు వర్గాలకు న్యాయం చేకూర్చేదిగా ఉంది. పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, భారతీయ న్యాయ వ్యవస్థ ఈ తీర్పు ద్వారా విజయం సాధించాయి."
-హిందూ అమెరికన్ ఫౌండేషన్.
"ఇరు వర్గాలకు సమతూకం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. భవిషత్యులో ఎటువంటి వివాదాలనైనా భారత న్యాయస్థానం పరిష్కరించడంలో సమర్థంగా పనిచేస్తుందనడానికి ఈ తీర్పే నిదర్శనం."
-ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్(ఎఫ్ఐఐడిఎస్).
"రామ జన్మభూమి ఉద్యమం శతాబ్దాల పాటు వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ప్రతీక. తీర్పును స్వాగతిస్తున్నాం. "
-ప్రపంచ హిందూ కౌన్సిల్ ఆఫ్ అమెరికా.
ఇదీ చూడండి : జీడీపీ ఆధార సంవత్సరం మార్పు నిర్ణయం సరికాదు!'