భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. 2015లో అమెరికాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా తొలి అపాచీ గార్డియన్ హెలికాప్టర్‌ను శుక్రవారం భారత్‌కు అందించింది అగ్రరాజ్యం. ఈ అత్యాధునిక హెలికాప్టర్లు వాయుసేనను మరింత బలోపేతం చేస్తాయని అధికారులు తెలిపారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, పర్వత ప్రాంతాల సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ శత్రువులపై అనూహ్య రీతిలో దాడి చేయగలిగే విధంగా అపాచీ గార్డియన్‌ను రూపొందించారు. ఇప్పటికే ఈ ఏహెచ్- 64 అపాచీ హెలికాప్టర్లు అమెరికా సైన్యానికి విశేష సేవలు అందిస్తున్నాయి.
22 అపాచీ చాపర్ల కొనుగోలుకు 2015, సెప్టెంబర్‌లో అగ్రరాజ్యంతో భారత వాయుసేన బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది.
"ఇతర దళాలతో కలిసి పనిచేసేందుకు అపాచీ గార్డియన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ హెలికాప్టర్ కోసమే కొంతమంది పైలట్లు, సిబ్బంది ప్రత్యేకంగా అమెరికా సైన్య శిబిరంలో శిక్షణ పొందారు. "
---- భారత వాయుసేన.
ఇదీ చూడండి: 'మోదీ సిద్ధాంతం విభజించి.. పాలించడం'